RSS

Daily Archives: April 6, 2014

స్కాట్లండ్ బాలికకు.. ఐన్‌స్టీన్‌తో సమానమైన ఐక్యూ


స్కాట్లండ్ బాలికకు.. ఐన్‌స్టీన్‌తో సమానమైన ఐక్యూ
లండన్: స్కాట్లాండ్‌కు చెందిన పదమూడేళ్ల బాలిక ఈవ్ వెడర్‌బర్న్.. విఖ్యాత మేధావి అల్బర్ట్ ఐన్‌స్టీన్‌తో సమానమైన ఐక్యూతో ఆందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రజ్ఞా పరీక్షలతో ఐక్యూను నిర్ధారించే సంస్థ ‘మెన్సా నిర్వహించిన పరీక్షలో ఈవ్ 160 స్కోరు సాధించింది. దీంతో ఆమెకు ఐన్‌స్టీన్, స్టీఫెన్ హ్యాకింగ్, బిల్‌గేట్స్ వంటి మహామేధావుల సరసన స్థానం లభించింది. ఓ క్రిస్మస్ బహుమతితో పాటు అందిన ‘మెన్సా పరీక్ష పత్రాన్ని నింపిన ఆమె అందులో 160 స్కోరు సాధించడంతో ఈ ఘనత సొంతం చేసుకుంది.

Advertisements
 
Comments Off on స్కాట్లండ్ బాలికకు.. ఐన్‌స్టీన్‌తో సమానమైన ఐక్యూ

Posted by on April 6, 2014 in Uncategorized

 

‘భౌతికం’ ప్రశ్నలతో పరేషాన్!


‘భౌతికం’ ప్రశ్నలతో పరేషాన్!

* రాష్ట్రంలో ప్రశాంతంగా జేఈఈ మెయిన్
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 6న నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్షలో భౌతికశాస్త్రం ప్రశ్నలు కఠినంగా ఉన్నట్లు అధ్యాపక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి, జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హత పొందడానికి ఈ పరీక్షను సీబీఎస్ఈ నిర్వహిస్తోంది. గణితం, రసాయన శాస్త్రం ప్రశ్నల్లో కొన్ని సులభంగా..మధ్యస్థంగా ఉన్నాయి. భౌతికశాస్త్రం ప్రశ్నలు మాత్రం విద్యార్థుల సహనాన్ని పరీక్షించాయి. 10 నుంచి ప్రశ్నలు చాలా సులభంగా..13 ప్రశ్నలు మధ్యస్థంగా ఉండగా మిగిలిన ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నాయి. భౌతికశాస్త్రం సీరీస్ కోడ్-హెచ్‌లో..రెండో ప్రశ్న ‘మారుతున్న అయస్కాంత క్షేత్రం ఇవ్వబడినది. సామర్థ్యం కనుక్కోవాలంటే నిర్ణీత అవధుల్లో సమాకలనం చేయాల్సి ఉంది. అది చేసి అవధులు ప్రతిక్షేపించినప్పుడు ఆ విలువ ఏమిటన్న దానికి జవాబు కనుక్కోవాలంటే క్యాలిక్యులేటర్ సాయం లేకుండా చేయడం చాలా కష్టమని నిపుణులు పేర్కొన్నారు. ఈ ప్రశ్నకు జవాబు మూల్యాంకనంపై అధికారులు పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
హైదరాబాద్‌లో పరీక్ష ప్రశాంతంగా జరిగిందని, మొత్తం సుమారు 47 వేల( రెండు పేపర్లు) మంది రాయాల్సి ఉండగా వారిలో 95 శాతం హాజరయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. ఖమ్మంలో ఉదయం పరీక్షకు 4659 మంది విద్యార్థులకు 4540 మంది, పేపరు-2కు 1721 మందికి 1606 మంది హాజరయ్యారు. వరంగల్‌లో పేపరు-1కు 9933 మందికి 9668 (97.33%), పేపరు-2 పరీక్షకు 2885కు 2743 (95.07%) మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారికవర్గాలు పేర్కొన్నాయి. పరీక్ష పూర్తయ్యాక ప్రశ్నల బుక్‌లెట్‌ను తీసుకెళ్లేందుకు విద్యార్థులకు అవకాశమిచ్చారు.

 
Comments Off on ‘భౌతికం’ ప్రశ్నలతో పరేషాన్!

Posted by on April 6, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: