RSS

ఇంటర్ ఫలితాలు ఎప్పుడు?

20 Apr

ఇంటర్ ఫలితాలు ఎప్పుడు?

ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల ఫలితాల వెల్లడి తేదీల ఖరారుపై ఇంటర్ బోర్డు ఓ అవగాహనకు రాలేకపోతోంది. జవాబు పత్రాల మూల్యాంకన విధుల్లో పాల్గొనే అధ్యాపకులు ఎన్నికల నిర్వహణ శిక్షణ కార్యక్రమాలకు హాజరవుతుండటం, పండుగలు రావడం వల్ల నిర్ణీత వ్యవధి కంటే అయిదారు రోజుల ఆలస్యంగా పనులు జరుగుతున్నాయి. ఫలితంగా ఇప్పటికే పూర్తికావాల్సిన మూల్యాంకన ప్రక్రియ ఆలస్యమైంది. మంగళవారం (22వ తేదీ) నాటికి ఈ పని పూర్తవుతుందని సమాచారం. పరిస్థితులు అనుకూలిస్తే ఏప్రిల్ 27న ప్రథమ, 29న ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడించాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో ఈ నెల 30న జరిగే ఎన్నికలు, జూన్ 2వ తేదీ అపాయింటెడ్ డేని దృష్టిలో ఉంచుకుని చర్యలను వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. డీకోడింగ్ వంటి పనులు సకాలంలో పూర్తవుతాయా అనేది ప్రస్తుతానికి సంశయంగా మారింది. పరిస్థితులు అనుకూలించకుంటే ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలను ఏప్రిల్ 30న తెలంగాణలో జరిగే ఎన్నికలకు ముందు, అనంతరం ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

 
Comments Off on ఇంటర్ ఫలితాలు ఎప్పుడు?

Posted by on April 20, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: