RSS

విద్యార్థులకు అందుబాటులో పాఠ్యపుస్తకాలు!

20 Apr

* ఏప్రిల్ 23తేదీలోగానేపంపిణీ
* విద్యాశాఖలోసరికొత్తరికార్డు

ఈనాడు, హైదరాబాద్: ఏటా పాఠశాలలు పునఃప్రారంభమైన రెండు, మూడునెలల వరకు విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందేవి కావు. కానీ, రానున్న విద్యా సంవత్సరం (2014-15)లో అలాంటి బాధలు ఎంతమాత్రం ఉండబోవు. ప్రాథమిక విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య చొరవతో ఈ విద్యా సంవత్సరం ముగింపు (ఏప్రిల్ 23వ తేదీ)లోగానే ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందబోతున్నాయి. రానున్న విద్యా సంవత్సరానికి 5.7. కోట్ల పుస్తకాలు అవసరంకాగా ఇప్పటివరకు 4.9 కోట్ల పాఠ్యపుస్తకాలను జిల్లాలకు పంపించినట్లు అధికారులు ఏప్రిల్ 20న తెలిపారు. మరో రెండు, మూడురోజుల్లో మిగిలినవాటిని జిల్లా కేంద్రాలకు పంపిస్తామన్నారు.

 
Comments Off on విద్యార్థులకు అందుబాటులో పాఠ్యపుస్తకాలు!

Posted by on April 20, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: