RSS

* వైవీయూలోఅయిదేళ్లఎమ్మెస్సీకోర్సులు * ప్రవేశానికిదరఖాస్తులస్వీకరణ

23 Apr

* వైవీయూలోఅయిదేళ్లఎమ్మెస్సీకోర్సులు
* ప్రవేశానికిదరఖాస్తులస్వీకరణ

కడప నగరం, న్యూస్‌టుడే: మాధ్యమిక విద్య (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణులయ్యేవారికి యోగివేమన విశ్వవిద్యాలయం అయిదేళ్ల పీజీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉన్నత విద్యలో అత్యుత్తమ శిక్షణతో భవిష్యత్తు పారిశ్రామిక అవసరాల కోసం మానవ వనరుల అభివృద్ధి చేస్తోంది వైవీయూ. అత్యున్నతమైన ప్రామాణికమైన పరిశోధనల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం, ఆ దిశగా వారి దృష్టి మళ్లించే ఉద్దేశం వంటి లక్ష్యాలతో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల రూపకల్పన చేసింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం జీవ సాంకేతిక శాస్త్రం (బయోటెక్నాలజి), జీవ సమాచారశాస్త్రం (బయో ఇన్ఫర్మేటిక్స్), భూవిజ్ఞాన శాస్త్రం (ఎర్త్‌సైన్సు) విభాగాలతో అయిదేళ్ల కోర్సులో ప్రవేశాలు మొదలయ్యాయి. ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ చదివిన విద్యార్థులు అర్హులు. ఒకేసారి డిగ్రీ, పీజీ పూర్తి చేసుకోవటం ఈ కోర్సుల ప్రత్యేకత. అంతేకాక గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు విద్యార్థులు మానవీయ శాస్త్రాలలో కూడా ప్రాథమిక అవగాహన పొందుతారు. యోగివేమన విశ్వవిద్యాలయంలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులకు బయోటెక్నాలజి, బయోఇన్ఫర్మేటిక్స్, ఎర్త్‌సైన్సు శాస్త్రాల్లో ప్రత్యేక శిక్షణ, నైపుణ్యాన్ని అందిస్తారు. సెమిస్టర్ విధానం ద్వారా జరిగే ఈ కోర్సుల్లో అంత్యంత సులభమైన పద్ధతుల ద్వారా బోధన, పరిశోధనల్లో విద్యార్థులను మమేకం చేస్తారు. అనేక శాస్త్రీయ అంశాలపై విద్యార్థి ఏకకాలంలో పట్టు సాధించే అవకాశం ఉంటుంది.
* ఆధునిక విద్యా ప్రక్రియ

అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఒక ఆధునిక విద్యా ప్రక్రియ అని ఈ సందర్భంగా యోగివేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్ పేర్కొన్నారు. రెండు కోర్సులు ఏకకాలంలో అభ్యసించే అవకాశం వైవీయూ కల్పిస్తోందన్నారు. 21వ శతాబ్ధంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జీవసాంకేతిక శాస్త్రం, భూవిజ్ఞాన శాస్త్రంలో అయిదేళ్ల కోర్సులు వైవీయూ అందిస్తోందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైవీయూ పీజీసెట్ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపుకోవచ్చని ప్రధానాచార్యులు ఆచార్య ధనుంజయనాయుడు తెలిపారు. వైవీయూ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు వివరించారు.

 
Comments Off on * వైవీయూలోఅయిదేళ్లఎమ్మెస్సీకోర్సులు * ప్రవేశానికిదరఖాస్తులస్వీకరణ

Posted by on April 23, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: