RSS

Monthly Archives: May 2014

ఐన్‌స్టీన్‌ను మించిన ఐక్యూ


ఐన్‌స్టీన్‌ను మించిన ఐక్యూ
లండన్‌: బ్రిటన్‌కు చెందిన పదకొండేళ్ల ‘రామర్ని విల్‌ఫ్రెడ్‌’ ప్రసిద్ధ భౌతికశాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ను మించిన ప్రజ్ఞాసూచి(ఐక్యూ)తో ఆశ్చర్యపరిచాడు. బిర్బెక్‌ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఈ పరీక్షలో 162 స్కోరుతో ఈ ఘనత సాధించాడు.

Advertisements
 
Comments Off on ఐన్‌స్టీన్‌ను మించిన ఐక్యూ

Posted by on May 15, 2014 in Uncategorized

 

* గత ఏడాది కంటే 7 వేల అధిక దరఖాస్తులు


* గత ఏడాది కంటే 7 వేల అధిక దరఖాస్తులు
– ఎంసెట్ కన్వీనర్ రమణారావు
ఈనాడు, విశాఖపట్నం: గత ఏడాదితో పోలిస్తే వైద్యవిద్యలో ప్రవేశానికి ఈసారి ఏడు వేల దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయని ఎంసెట్-2014 కన్వీనర్ ఎన్.వి.రమణారావు తెలిపారు. ఇంజినీరింగ్‌కు ఎనిమిది వేల దరఖాస్తులు తగ్గాయని చెప్పారు. మే 15న విశాఖ ప్రాంతీయ సమన్వయకర్త ఆచార్య కె.వెంకటసుబ్బయ్యతో కలిసి ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. ఇంజినీరింగ్, వ్యవసాయ, వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఈ నెల 22న 3,95,600 మంది పరీక్షలు రాయనున్నారని చెప్పారు. వీరిలో 2,82,800 మంది ఇంజినీరింగ్, 1,12,800 మంది మెడికల్ అభ్యర్థులు ఉన్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 750 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అనుమానిత అభ్యర్థులపైన, పరీక్ష కేంద్రాలపెనౖ ప్రత్యేక నిఘా ఉంటుందని రమణారావు తెలిపారు. విశాఖ జిల్లాలో 22 నుంచి 25 పరీక్ష కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు వెంకటసుబ్బయ్య చెప్పారు. గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో 300 మంది అభ్యర్థులపై నిఘా పెట్టామన్నారు. గతంలో ఒకసారి రాసినవారు, వివిధ కోర్సులు చేస్తున్నవారు కూడా మళ్లీ పరీక్షలకు హాజరవుతున్నట్లు గుర్తించామని తెలిపారు.

 
Comments Off on * గత ఏడాది కంటే 7 వేల అధిక దరఖాస్తులు

Posted by on May 15, 2014 in Uncategorized

 

సెంట్రల్ వర్సిటీగా మార్చండి!


సెంట్రల్ వర్సిటీగా మార్చండి!
* తెలుగు విశ్వవిద్యాలయ అధికారుల ప్రతిపాదన
ఈనాడు, హైదరాబాద్:
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మార్చాలని వర్సిటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. తెలుగు విశ్వవిద్యాలయంతో పాటు మొత్తం ఆరు విశ్వవిద్యాలయాలను పునర్విజభన బిల్లులోని పదో షెడ్యూల్‌లో చేర్చిన సంగతి తెలిసిందే. అంటే ఇవి ఏడాది పాటు ఉమ్మడిగా పనిచేస్తాయన్నమాట. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆయా విశ్వవిద్యాలయాల ఆస్తులు, సిబ్బంది, నిధులు తదితర వివరాలను కోరింది. దీనికోసం ప్రత్యేక ప్రశ్నావళిని కూడా పంపించింది. ఇందులో విశ్వవిద్యాలయం అభివృద్ధిపై సూచనలనూ ఆహ్వానించింది. దీనికి స్పందించిన తెలుగు విశ్వవిద్యాలయం అధికారులు… ప్రపంచవ్యాప్తంగా సుమారు 14 కోట్ల మంది తెలుగువారున్నారని, వారందరి కోసం విశ్వవిద్యాలయం మరింత అభివృద్ధి సాధించేందుకు దీన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మార్చాలని ప్రతిపాదించారు. ఉర్దూ, హిందీ, ఆంగ్లం-విదేశీ భాషలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలున్నాయని గుర్తుచేశారు. తమ ప్రతిపాదనపై ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. దీనిపై గవర్నర్‌ను కూడా కలవాలని యోచిస్తున్నామని చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రస్తుతం ఉమ్మడి జాబితాలో చేర్చినా.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారన్నారు.

 
Comments Off on సెంట్రల్ వర్సిటీగా మార్చండి!

Posted by on May 10, 2014 in Uncategorized

 

పాఠశాలల్లో పిల్లలకు కనీస వసతులు కల్పించరా!


పాఠశాలల్లో పిల్లలకు కనీస వసతులు కల్పించరా!
ఏపీ సర్కారు తీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి
* స్వయంగా హాజరుకావాలని ప్రిన్సిపల్ కార్యదర్శికి ఆదేశం

న్యూఢిల్లీ: పాఠశాలల్లో సరైన మంచినీటి వసతి కల్పన, బాలురు… బాలికలకు విడివిడిగా మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలన్న తమ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదంటూ సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ విషయంలో పరిస్థితి ఏమిటో కచ్చితంగా వివరించేందుకు స్వయంగా హాజరుకావలసిందిగా సంబంధిత ప్రిన్సిపల్ కార్యదర్శిని ఆదేశించింది. అంతేకాదు, ఈ అంశంలో ఇప్పటిదాకా జరిగిన ప్రగతి, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ఒక అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కోరింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, మైనారిటీ, మైనారిటీయేతర పాఠశాలలు అన్నింటిలోనూ మంచినీటి వసతి, ఆడ, మగ పిల్లలకు వేర్వేరుగా మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలంటూ విస్పష్ట ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ వసతుల కల్పన మానవ వనరుల కోణం నుంచి చూస్తే అత్యవసరమని తెలిపింది. చదువుకునే చోట వాతావరణాన్ని ఈ తరహా వసతులు ఎంతగానో ప్రభావితం చేస్తాయని జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ వి.గోపాలగౌడతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసింది.
మంచినీరు, మరుగుదొడ్ల వసతి కల్పనతో పాటు తగిన సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది కూడా అత్యవసరమని తెలిపింది. ఇందులో ఏది లేకపోయినా అది విద్యావ్యవస్థ లక్ష్యానికి విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడింది. జూన్ ఏడోతేదీన జరిగే కేసు విచారణకు స్వయంగా హాజరుకావలసిందిగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శిని ఆదేశించింది.
పాఠశాలల్లో వసతుల కల్పనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన వివరణను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తమకు మరింత వ్యవధి కావాలంటూ ఆంధ్రప్రదేశ సర్కారు చేసుకున్న అభ్యర్థనను కోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించిం

 
Comments Off on పాఠశాలల్లో పిల్లలకు కనీస వసతులు కల్పించరా!

Posted by on May 10, 2014 in Uncategorized

 

Proceedings for opening of our Service registers


princ

 
1 Comment

Posted by on May 10, 2014 in Uncategorized

 

మే 8న టెట్ ఫలితాల వెల్లడి


మే 8న టెట్ ఫలితాల వెల్లడి

ఈనాడు-హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను మే 8న మధ్యాహ్నం ప్రకటించనున్నారు. పరీక్ష పేపరు-1ను 56,902, పేపరు-2ను 3,40,560 మంది అభ్యర్థులు రాసినట్లు టెట్ నిర్వాహకులు సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను గురువారం మధ్యాహ్నానికి అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు. గత మార్చి 16న టెట్ నిర్వహించిన అధికారులు మార్చి 22న ప్రాథమిక ‘కీ’ని విడుదల చేశారు. అభ్యంతరాలను తెలియజేసేందుకు మార్చి 29 వరకు గడువు ఇచ్చారు. గడువు పూర్తయ్యే నాటికి ప్రాథమిక కీ పై దాదాపు 27 వేల అభ్యంతరాలు వచ్చాయి. వీటిని రాష్ట్ర విద్య పరిశోథన శిక్షణ సంస్థ ప్రత్యేక నిపుణుల బృందాలు క్షుణ్ణంగా పరిశీలించాయి. చివరికి మూడు, నాలుగు ప్రశ్నల కింద జవాబుల్లో మార్పులుచేసి తుది ‘కీని విద్యా శాఖ మే 1న ప్రకటించింది

 
Comments Off on మే 8న టెట్ ఫలితాల వెల్లడి

Posted by on May 8, 2014 in Uncategorized

 

MSTA Flash flash….. IR,DA Sanctioned…..Proceedings will comes Tomorrow /day after tmrw


MSTA Flash flash…..
IR,DA Sanctioned…..Proceedings will comes Tomorrow /day after tmrw

 
4 Comments

Posted by on May 8, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: