RSS

ఐబీపీఎస్ క్లర్క్స్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

10 Aug

ముంబ‌యి: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (ఐబీపీఎస్‌) క్లర్కు పోస్టుల భ‌ర్తీకి ఆగ‌స్టు 9న నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. సీడ‌బ్ల్యూఈ క్లర్క్స్‌ – IV ద్వారా క్లరిక‌ల్ కేడ‌ర్ పోస్టుల భ‌ర్తీ చేప‌ట్టనున్నారు. ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఆగ‌స్టు 12న ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభ‌మ‌వుతుంది. సెప్టెంబ‌రు 1 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు రుసుము రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ల‌కు ద‌ర‌ఖాస్తు రుసుము రూ.100 గా నిర్ణయించారు. ఆన్‌లైన్ ద్వారా ఆగ‌స్టు 12 నుంచి సెప్టెంబ‌రు 1 వ‌ర‌కు, ఆఫ్‌లైన్ ద్వారా ఆగ‌స్టు 14 నుంచి సెప్టెంబ‌రు 3 వ‌ర‌కు ఫీజు చెల్లించ‌వ‌చ్చు. డిసెంబ‌రులో వివిధ తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో రాత‌ ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. ఈ పరీక్ష ద్వారా 19 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఖాళీలకు అనుగుణంగా క్లర్కు పోస్టులను భర్తీ చేస్తారు.

 
Comments Off on ఐబీపీఎస్ క్లర్క్స్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

Posted by on August 10, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: