RSS

పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు

12 Aug

* వెంటనే అమలు చేయండి: గంటా
ఈనాడు, హైదరాబాద్: పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల బయోమెట్రిక్ హాజరును వెంటనే అమలు చేయాలని మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. ఆగస్టు 12న ఉన్నత విద్యాశాఖ అధికారులు నీలం సహానీ, అదర్ సిన్హా, వేణుగోపాల్‌రెడ్డి, విజయ్ కుమార్, డోబ్రియల్‌తో ఆయన సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల ఆధార్ అనుసంధానాన్ని నెలాఖరులోగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రతిభా అవార్డుల ప్రదానానికి ప్రత్యేక విధివిధానాలు రూపొందించాలని, ఎక్కువ మంది విద్యార్థులు అవార్డుల పరిధిలోకి వచ్చేలా చూడాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. ప్రతిభా అవార్డుల కింద ఇచ్చే నగదు ప్రోత్సాహకాలు పెంచాలని చెప్పారు. సమీకృత కంప్యూటరు బోధన పథకం కింద సమకూర్చిన కంప్యూటర్లను విద్యార్థులకు వినియోగంలోకి తీసుకువచ్చి, ఈ-విద్యను అందించాలని ఆదేశించారు. పాఠశాలల క్లస్టర్ల కోసం ప్రణాళిక రూపొందించాలని, ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును వెంటనే ముఖ్యమంత్రికి పంపించాలని సూచించారు. 14వ ఆర్థిక సంఘం నుంచి విద్యారంగానికి మరిన్ని నిధులు రాబట్టేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

 
Comments Off on పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు

Posted by on August 12, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: