RSS

ఏపీలో పాఠశాలల పనివేళల్లో మార్పు

14 Aug

ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల పనివేళల్ని ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు ఆగస్టు 14న పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కొత్త పనివేళలు ఆగస్టు 16 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనిలో భాగంగా ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పనివేళలు మాత్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటలుగా నిర్ణయించారు. కాగా, ఈ పనివేళల సవరణను ప్రభుత్వం మరోసారి పరిశీలించాలని ఎస్టీయూ డిమాండ్ చేసింది.

 
Comments Off on ఏపీలో పాఠశాలల పనివేళల్లో మార్పు

Posted by on August 14, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: