RSS

ప్రపంచ అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఐఐఎస్‌సీ

15 Aug

బీజింగ్: ప్రపంచ అత్యుత్తుమ విద్యాసంస్థ జాబితాలో తొలి 500 విద్యా సంస్థల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్‌సీ)-బెంగళూరు నిలిచింది. చైనాకు చెందిన ఓ సంస్థ విడుదల చేసిన అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలో ఐఐఎస్‌సీకి ఈ స్థానం దక్కింది. ఈ సంస్థను 19 శతాబ్దం చివరి దశలో జంషెడ్‌జీ నుస్సేర్‌వంజీ టాటా స్థాపించారు. అకడమిక్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్ జాబితాలో ఐఐఎస్‌సీ 301-400 మధ్య స్థానాన్ని సాధించింది. హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్‌ఫోర్డ్ మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. న్యాచురల్ సైన్సెస్, గణిత విభాగంలో 151-200 మధ్య స్థానంలో నిలిచింది. రసాయన శాస్త్ర విభాగంలో 51-75 మధ్య స్థానం పొందింది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన జాన్ హప్‌కిన్స్, కర్నేగి మెలన్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఐఐఎస్‌సీతో పాటు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ 101-150 స్థానంలో నిలిచాయి.

 
Comments Off on ప్రపంచ అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఐఐఎస్‌సీ

Posted by on August 15, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: