RSS

ఏపీలో ‘బిట్స్’ ఏర్పాటుకు ప్రతిపాదన!

20 Aug

ఏపీలో ‘బిట్స్’ ఏర్పాటుకు ప్రతిపాదన!
ఈనాడు, హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మక బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) ప్రాంగణాన్ని ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా ప్రతిపాదన చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం బిట్స్ సంస్థకు పిలానితోపాటు దుబాయ్, గోవా, హైదరాబాద్‌లో ప్రాంగణాలున్నాయి. 2008లో హైదరాబాద్‌లోని శామీర్‌పేట మండలంలో చివరగా ఒక ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఇంజినీరింగ్, సైన్స్ విద్య, పరిశోధనలో బిట్స్‌కు ప్రత్యేక స్థానముంది. ఆంధ్రప్రదేశ్‌కు సాధ్యమైనన్ని విద్యాసంస్థలను తీసుకురావాలని భావిస్తున్న చంద్రబాబు బిట్స్ ప్రాంగణం ఏర్పాటుపై ఆసక్తి చూపుతున్నారు. ఆగస్టు 10న బిట్స్ హైదరాబాద్ ప్రాంగణానికి బిర్లా సంస్థల అధినేత కుమార మంగళం బిర్లా విచ్చేసిన సంగతి తెలిసిందే. అదేరోజు రాత్రి సీఎం ఆయన్ను విందుకు ఆహ్వానించారు. స్వల్ప అస్వస్థత కారణంగా బిర్లా వెళ్లలేకపోయారు. చంద్రబాబు మాత్రం ఏపీలో బిట్స్ ఏర్పాటుకు ప్రయత్నిస్తారని బిట్స్ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

 
Comments Off on ఏపీలో ‘బిట్స్’ ఏర్పాటుకు ప్రతిపాదన!

Posted by on August 20, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: