RSS

బోధన వృత్తి మాత్రమే కాదు జీవన ధర్మం

04 Sep

బోధన వృత్తి మాత్రమే కాదు జీవన ధర్మం
* ప్రధాన మంత్రి నరేంద్రమోడీ
ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: ఉపాధ్యాయ వృత్తి కేవలం వృత్తి మాత్రమే కాదని జీవన ధర్మమని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకోనున్న 350 మంది టీచర్లతో సెప్టెంబరు 4న ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు మారుతున్న ప్రపంచ స్థితిగతులు అర్థంచేసుకొని, కొత్తతరాలకు అనుగుణంగా బోధన చేయాలని తెలిపారు. ఉపాధ్యాయుడు ఎప్పటికీ రిటైర్‌ అవ్వరని కొత్త విషయాలు నేర్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారని చెప్పారు.

 
Comments Off on బోధన వృత్తి మాత్రమే కాదు జీవన ధర్మం

Posted by on September 4, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: