RSS

Daily Archives: September 5, 2014

ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల జాబితా సిద్ధం


* 9 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
* 16 నుంచి వెబ్ ఆప్షన్లు
ఈనాడు, హైదరాబాద్: అర్హత పరీక్షలో ఎంపికై చాలాకాలంగా ఎదురు చూస్తున్న ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల జాబితాను సెప్టెంబరు 6న మధ్యాహ్నం విడుదల చేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. సుమారు 1700 ఉపాధ్యాయ (టీజీటీ; పీజీటీ) పోస్టులకు అర్హులైన అభ్యర్థుల జాబితాకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన సెప్టెంబరు 9, 10 తేదీల్లో జరుగుతుంది. హైదరాబాద్ (మహబూబియా స్కూలు, గన్‌ఫౌండ్రీ), వరంగల్ (డైట్ కాలేజీ) ఆర్జేడీ కార్యాలయాల్లో ఈ పరిశీలన ఉంటుంది. తర్వాత 16 నుంచి 18వ తేదీ వరకూ అభ్యర్థులు వెబ్ఆప్షన్లు పెట్టుకోవచ్చు. 20న పాఠశాలల్ని కేటాయిస్తారు. 21న సంబంధిత ఆర్జేడీ కార్యాలయాల్లో పోస్టింగ్ ఆర్డర్లు అందజేస్తారు. జాబితాతో పాటు ఇతర వివరాలను http://telanganams.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. సుమారు 650 టీజీటీ; 1060 పీజీటీ పోస్టులకు నియామకాలు చేయబోతున్నారు. రాష్ట్రంలో కేంద్రీయ విద్యాలయాల పద్ధతిలో ఆదర్శ పాఠశాలలను ఆరంభించినప్పుడు ఈ నియామక పరీక్షలు జరిపారు. అయితే ఎంపికైన అందరినీ కాకుండా… అప్పటి అవసరాల మేరకు కొంతమందికే పోస్టింగులిచ్చారు. ఇప్పుడు మిగిలిన వారికి అవకాశం లభిస్తోంది. కోర్టు అనుమతితో పరీక్షరాసి ఉత్తీర్ణులైన తెలుగుమీడియం అభ్యర్థులు కూడా కొంతమంది ఇందులో ఉన్నారు.

Advertisements
 
3 Comments

Posted by on September 5, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: