RSS

ఏపీ ‘ఆదర్శ బడుల నియామకాలపై పురోగతి!

02 Oct

ఏపీ ‘ఆదర్శ బడుల నియామకాలపై పురోగతి!
ఈనాడు-హైదరాబాద్: ఏపీలోని ఆదర్శ పాఠశాల అధ్యాపకుల (టీజీటీ, పీజీటీ) నియామకాలపై నెలకొన్న ప్రతిష్ఠంభనను తొలగించే ప్రక్రియ మొదలైంది. సుమారు 13,500 వరకు జరగాల్సిన ఈ నియామకాలను చేపట్టడంలో జరుగుతోన్న జాప్యంపై ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ అధికారులతో అక్టోబరు 1న సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అక్టోబరు 8న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఈలోగా..అవసరమైన అధికారిక ఉత్తర్వులు జారీచేయాలని పేర్కొన్నారు. మరోవైపు…అపరిష్కృత సమస్యగా మిగిలిపోయిన భాషా పండితుల పండిట్ పోస్టుల అప్‌గ్రేడేషన్‌పై కూడా మంత్రి దృష్టిపెట్టారు. అవసరమైన ఉత్తర్వుల జారీ ఎందుకు జరగలేదని అధికారులను ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన దస్త్రం ఆర్థిక శాఖ వద్ద ఉందని…అది వచ్చిన వెంటనే అప్‌గ్రేడేషన్‌పై ఉత్తర్వులు జారీచేస్తామని అధికారులు మంత్రికి వివరణ ఇచ్చారు. డైట్‌సెట్-2014 కౌన్సెలింగ్ ప్రారంభానికి అవసరమైన అనుబంధ కళాశాలల పురోగతి గురించి కూడా మంత్రి ఆరా తీశారు.

 
Comments Off on ఏపీ ‘ఆదర్శ బడుల నియామకాలపై పురోగతి!

Posted by on October 2, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: