RSS

ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పించాల్సిందే!

17 Oct

ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పించాల్సిందే!

* ఏపీలో 2.5 లక్షల బీఎడ్ అభ్యర్థులు
ఈనాడు, హైదరాబాద్: బీఎడ్ విద్యను పూర్తిచేసిన వారు ఆంధ్రప్రదేశ్‌లో 2.5 లక్షల మంది ఉన్నారని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ అంచనా వేసింది. ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ పూర్తిచేసిన వారికి అర్హత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కేంద్రానికి మరోసారి తెలియచేస్తూ లేఖ రాయబోతున్నారు. ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అర్హతను కేంద్రం తొలగించింది. అయితే.. తెదేపా ఎన్నికల ప్రణాళికలో వారికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నందువల్ల ఆ దిశగా కేంద్రంతో సంప్రదింపులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి నుంచి వచ్చిన లేఖకు ప్రతిస్పందించే అంశాన్ని మంత్రి గంటా దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు. ప్రతి ఏడాది బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు వేల సంఖ్యలో వస్తూనే ఉన్నారని.. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కింద రాష్ట్రంలో అర్హత సాధించిన అభ్యర్థులు 1,33,028 మంది ఉన్నట్లు కేంద్రానికి శుక్రవారం లేఖ పంపబోతున్నారు. 2016, జనవరి 01 వరకు ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ వారికి అర్హత కల్పించాలని పేర్కొననున్నారు. ఎంపిక చేసిన బీఎడ్ అభ్యర్థులకు ప్రాథమిక స్థాయి విద్యార్థుల బోధనకు సంబంధించి అవగాహన కల్పించేలా తరగతులు నిర్వహిస్తున్నామని కేంద్రానికి వివరించనున్నారు. కేంద్రం నుంచి తగిన సానుకూలత కనిపించకపోతే.. బీఎడ్ అభ్యర్థులను సైతం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారుల వద్దకు తీసుకువెళ్లి వాస్తవ పరిస్థితుల్ని తెలియచేయాలన్న దిశగా కూడా విద్యాశాఖ భావిస్తోంది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని నెరవేర్చలేని పరిస్థితులు తలెత్తితే అందుకుగల కారణాలను అభ్యర్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో చర్చ జరిగింది.

 
Comments Off on ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పించాల్సిందే!

Posted by on October 17, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: