RSS

యూజీసీ నెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

19 Oct

యూజీసీ నెట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ (యూజీసీ) నేషనల్‌ ఎలిజిబిలిటి టెస్ట్‌ (నెట్‌)-2014 డిసెంబర్‌ నోటిఫికేషన్‌ను అక్టోబ‌ర్ 17న‌ అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షను సీబీఎస్‌ఈ నిర్వహిస్తుంద‌ని, ప్రవేశ పరీక్షకు నవంబర్‌ 15లోగా ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఫీజులను చెల్లించి చలానాలను నవంబర్‌ 18లోగా ఆప్‌లోడ్‌ చేయాలన్నారు. దరఖాస్తు పత్రాలను ఆన్‌లైన్‌ నుంచి నవంబర్‌ 19లోగా ప్రింట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్‌ 28న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. పూర్తిచేసిన దరఖాస్తులను నవంబర్‌ 25లోగా సంబంధిత కో ఆర్డినేటర్‌ కార్యాలయంలో ఇవ్వాల‌ని తెలిపారు. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ని చూడాల‌ని సూచించారు.

Advertisements
 
Comments Off on యూజీసీ నెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Posted by on October 19, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: