RSS

3 నుంచి 30 వరకు సైనిక నియామక ర్యాలీ

28 Oct

3 నుంచి 30 వరకు సైనిక నియామక ర్యాలీ

చాలారోజుల తర్వాత ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఇంటర్‌ పూర్తిచేసి బ్యాంకు ఉద్యోగం చేయాలనుకునేవారికి అదే తరహాలోని ఈ అవకాశం వరం లాంటిది! దీంతోపాటు డిగ్రీ అర్హతతో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. వీటి వివరాలూ, సిద్ధమయ్యే విధానాల గురించి పరిశీలిద్దాం!
భారత ప్రభుత్వ సంస్థ ‘న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ’ 509 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లు, 1536 అసిస్టెంట్ల నియామకం కోసం ప్రకటన విడుదల చేసింది. వీటిలో ఎ.ఒ. పోస్టులకు దరఖాస్తు చేయాలంటే డిగ్రీ అవసరం. అసిస్టెంట్‌ పోస్టులకు ఇంటర్‌ (60%)/ డిగ్రీ విద్యార్హత ఉండాలి. ఎ.ఒ., అసిస్టెంట్‌… రెండింటి పరీక్ష విధానం బ్యాంకు పరీక్ష మాదిరే ఉంటుంది. రెండింటి ఎంపిక విధానం ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్‌వ్యూల ద్వారా జరుగుతుంది.
సబ్జెక్టులు ఒకేవిధం
ఈ పరీక్షలు రెండింటిలోనూ ఒకే విధమైన సబ్జెక్టులున్నాయి.
* ఎ.ఒ.లో జనరలిస్ట్‌ ఆఫీసర్‌కు రీజనింగ్‌, ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ సబ్జెక్టులున్నాయి.
* స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌కు ఈ నాలిగింటికీ అదనంగా ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ సబ్జెక్టు ఉంటుంది.
* అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టును అనుసరించి (ఫైనాన్స్‌, ఇంజినీరింగ్‌, లీగల్‌ & ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌) ఆ ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ సబ్జెక్టు ఉంటుంది.
* అసిస్టెంట్‌ పరీక్షలో రీజనింగ్‌, ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ సబ్జెక్టులు ఉంటాయి.
ఒకే రకమైన సబ్జెక్టులు ఉన్న కారణంగా ఒకే సన్నద్ధతతో రెండు పరీక్షలూ బాగా రాయవచ్చు. అయితే పరీక్షల స్థాయిలో కొంచెం భేదముంటుంది. ఎ.ఒ. పరీక్ష బ్యాంక్‌ పీవో పరీక్ష స్థాయిలోనూ, అసిస్టెంట్‌ పరీక్ష బ్యాంకు క్లరికల్‌ పరీక్ష స్థాయిలోనూ ఉంటాయి.
సన్నద్ధమయేదెలా?
ఇంతకుముందు నుంచీ బ్యాంకు పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు వారి సన్నద్ధతను అదేవిధంగా కొనసాగిస్తే సరిపోతుంది. కొత్తగా ఈ పరీక్ష రాయబోయే అభ్యర్థులు మాత్రం ఒక ప్రణాళికతో సన్నద్ధమవాలి. ఈ పరీక్షలకు ఉన్న రెండు నెలలకు పైగా సమయాన్ని సబ్జెక్టుల ప్రాథమికాంశాలను నేర్చుకోవడానికీ, వివిధ ప్రశ్నలను సాధన చేయడానికీ సరిగా వినియోగించుకోవాలి.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌/ న్యూమరికల్‌ ఎబిలిటీ: ఎ.ఒ. పరీక్షలో ప్రశ్నలు సింప్లిఫికేషన్‌ నుంచి 5- 10 ఉంటాయి. నంబర్‌ సిరీస్‌- 5; డేటా సఫిషియన్సీ- 5; క్వాడ్రిక్‌ ఈక్వేషన్స్‌ 3- 5; డేటా ఇంటర్‌ప్రిటేషన్‌- 15-20; అరిథ్‌మెటిక్‌- 5- 10 ప్రశ్నలుంటాయి. అసిస్టెంట్స్‌ పరీక్షలో సింప్లిఫికేషన్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలు, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి తక్కువ ప్రశ్నలు ఉంటాయి. శాతాలు, సగటులు, వడ్డీలు, లాభనష్టాలు, సమయం- పని, సమయం-దూరం, క్షేత్రగణితం వంటి అంకగణిత అంశాలను బాగా చూసుకోవాలి.
రీజనింగ్‌: : ఈ సబ్జెక్టులో సాధారణ రీజనింగ్‌ అంశాలైన దిశలు, కోడింగ్‌- డీకోడింగ్‌, ఆల్ఫబెట్‌- సీక్వెన్సెస్‌, రక్తసంబంధాలు, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, సిలాజిజం, డేటా సఫిషియన్సీ మొదలైనవాటినుంచి ప్రశ్నలుంటాయి. వీటితోపాటు స్టేట్‌మెంట్స్‌- అసంప్షన్‌, కోర్సెస్‌ ఆఫ్‌ యాక్షన్‌, కన్‌క్లూజన్స్‌, ఇన్ఫరెన్సెస్‌, పజిల్‌ టెస్ట్‌ వంటి అనలిటికల్‌ రీజనింగ్‌ నుంచి ఎ.ఒ. పరీక్షలో ప్రశ్నలు వస్తాయి.
ఇంగ్లిష్‌: కాంప్రహెన్షన్‌, స్పెలింగ్‌ ఎరర్స్‌, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌, క్లోజ్‌ టెస్ట్‌, రీ అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌, సిననిమ్స్‌, ఆంటనిమ్స్‌ మొదలైనవాటి నుంచి ప్రశ్నలుంటాయి. ప్రాథమిక వ్యాకరణాంశాలు బాగా చూసుకుంటే దాదాపు సగానికి పైగా ప్రశ్నలకు జవాబులను తేలికగా గుర్తించవచ్చు.
జనరల్‌ అవేర్‌నెస్‌: : సాధారణంగా గత 5, 6 నెలల వర్తమానాంశాలపై ప్రశ్నలడుగుతారు. ముఖ్యమైన సంఘటనలు, వ్యక్తులు, ప్రదేశాలు, పుస్తకాలు, రచయితలు, అవార్డులు, క్రీడలు, ముఖ్యమైన తేదీలు, బీమా, ఆర్థిక సంబంధ విషయాలపై ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ మార్కులు తెచ్చుకునే విభాగమిది.
కంప్యూటర్‌ నాలెడ్జ్‌: : అభ్యర్థులు ఎక్కువ మార్కులు తెచ్చుకునే ఈ విభాగంలో ప్రశ్నలు కంప్యూటర్‌ మౌలికాంశాలు, ఎంఎస్‌ ఆఫీస్‌, షార్ట్‌కట్‌ కీస్‌, ఇంటర్నెట్‌, నెట్‌వర్కింగ్‌, కంప్యూటర్‌ రంగానికి సంబంధించిన వర్తమానాంశాలపై వస్తాయి.
ఈ సబ్జెక్టులన్నింటిపై చక్కని అవగాహన పెంచుకోవాలి. బ్యాంకు పరీక్షల్లాగే ఈ పరీక్షలకు కూడా కేవలం 2 గంటల సమయమే ఉంది. కాబట్టి బాగా సాధన చేయాల్సి ఉంటుంది.
అసిస్టెంట్‌గా దాదాపు రూ. 15- 20 వేల వరకూ, ఎ.ఒ.గా రూ. 25-30 వేల వరకూ జీతభత్యాలు పొందే అవకాశం ఉంది. మరే ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరగని ఈ తరుణంలో వచ్చిన ఈ ప్రకటనలను మంచి అవకాశంగా మలచుకుని సరైన విధంగా సన్నద్ధమయితే విజయం సాధించవచ్చు.

 
Comments Off on 3 నుంచి 30 వరకు సైనిక నియామక ర్యాలీ

Posted by on October 28, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: