RSS

వేర్వేరుగానే ఇంటర్ పరీక్షలు

14 Nov

వేర్వేరుగానే ఇంటర్ పరీక్షలు

* ఆంధ్రలో మార్చి 11 నుంచి 31 వరకు
* తెలంగాణలో మార్చి 9 నుంచి 27 వరకు
* సమయసారిణి విడుదల
ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఇంటర్మీడియెట్ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు నవంబర్ 14న విడివిడిగా రెండు సమయసారిణిలను విడుదల చేసింది. ఉమ్మడిగా పరీక్షలు జరిపేందుకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేసినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం వేర్వేరుగా పరీక్షలు జరిపేందుకు మొగ్గుచూపింది. తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఆదేశాలు అనుసరించి ఇంటర్మీడియెట్ కార్యదర్శి రామశంకర నాయక్ రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా పరీక్షల తేదీలను నిర్ణయించారు. దీంతో ఈ పరీక్షల నిర్వహణ తీరుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
తొలుత ప్రకటించినట్లే ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 11వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ సెలవు దినాలను అనుసరించి ఈ తేదీల్లో మార్పులు ఉండొచ్చు. ఇంటర్ బోర్డు తాత్కాలికంగా ఈ తేదీలను ప్రకటించింది. తెలంగాణలో ఈ పరీక్షలు మార్చి 9న ప్రారంభమై 27న ముగియనున్నాయి.
మారనున్న ప్రశ్నపత్రాలు
రెండు రాష్ట్రాల్లో పాఠ్య ప్రణాళిక ఒకటే అయినప్పటికీ వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తున్న కారణంగా ప్రశ్నపత్రాలు కూడా మారనున్నాయి. సాధారణంగా పరీక్షల నిర్వహణలో ఏ కొత్త మార్పు తీసుకురాదలుచుకున్నా విద్యార్థులు ప్రథమ సంత్సరంలో ఉన్నప్పుడే ఆ విషయాలను తెలపాలి. సమైక్య రాష్ట్రంలో ప్రథమ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ఈ ఏడాది వరకైనా ఉమ్మడిగా పరీక్షలు జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. పర్యవసానంగా ప్రశ్నపత్రాల తయారీ, జవాబు పత్రాల మూల్యాంకనం దగ్గర నుంచి తిరిగి లెక్కింపు వరకు అన్ని వ్యవహారాలూ విడివిడిగానే జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ సమయసారిణి
జనవరి 28: మానవ, నైతిక విలువలు (ప్రథమ సంవత్సరం)
జనవరి 31: పర్యావరణ విద్య
ప్రయోగ పరీక్షలు: ఫిబ్రవరి 12-మార్చి 4
మార్చి 11: ప్రథమ సంవత్సర పరీక్షల ప్రారంభం
మార్చి 12: ద్వితీయ సంవత్సర పరీక్షల ప్రారంభం
మార్చి 11: ద్వితీయ భాష-1
మార్చి 12: ద్వితీయ భాష – 2
మార్చి 13: ఆంగ్లం-1
మార్చి 14: ఆంగ్లం-2
మార్చి 16: గణితం-1ఎ, వృక్ష శాస్త్రం-1, పౌర శాస్త్రం-1, మనస్తత్వ శాస్త్రం-1,
మార్చి 17: గణితం-2ఎ, వృక్షశాస్త్రం-2, పౌరశాస్త్రం-2, మనస్తత్వ శాస్త్రం-2
మార్చి 18: గణితం- 1బి, జంతుశాస్త్రం-1, చరిత్ర-1,
మార్చి 19: గణితం-2బి, జంతుశాస్త్రం-2, చరిత్ర-2
మార్చి 20: భౌతిక శాస్త్రం-1, అర్థశాస్త్రం-1, ప్రాచీన భాష (క్లాసికల్ లాంగ్వేజి)-1,
మార్చి 23: భౌతిక శాస్త్రం-2, అర్థశాస్త్రం-2, ప్రాచీన భాష (క్లాసికల్ లాంగ్వేజి)-2
మార్చి 24: రసాయన శాస్త్రం-1, వాణిజ్య శాస్త్రం-1, సామాజిక శాస్త్రం-1, కళలు, సంగీతం-1,
మార్చి 25: రసాయన శాస్త్రం-2, వాణిజ్య శాస్త్రం-2, సామాజిక శాస్త్రం-2, కళలు, సంగీతం-2
మార్చి 26: భూగర్భ శాస్త్రం-1, ప్రభుత్వ పాలన శాస్త్రం -1, గృహవిజ్ఞానం-1, తర్కం-1
మార్చి 27: భూగర్భ శాస్త్రం-2, ప్రభుత్వ పాలన శాస్త్రం-2, గృహ విజ్ఞానం-2, తర్కం-2 (బైపీసీ విద్యార్థులకు గణితం (బ్రిడ్జి కోర్సు) పేపరు-1, పేపరు-2)
మార్చి 30: భూగోళ శాస్త్రం-1, ఆధునిక భాష (మోడ్రన్ లాంగ్వేజి)-1
మార్చి 31: భూగోళ శాస్త్రం-2, ఆధునిక భాష (మోడ్రన్ లాంగ్వేజి)-2
ఈ తేదీల్లోనే వృత్తివిద్య (వొకేషనల్ కోర్సు) విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. త్వరలో ఆ వివరాలు ప్రకటించనున్నారు.
తెలంగాణలో ఇంటర్ పరీక్షల సమయపట్టిక (టైంటేబుల్) ఇదీ
ప్రథమ సంవత్సరం
మార్చి 9 పార్ట్-2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
మార్చి 11 పార్ట్-1 ఆంగ్లం పేపర్-1
మార్చి 13 పార్ట్-3 గణితం పేపర్-1ఎ; బోటనీ (వృక్షశాస్త్రం); సివిక్స్ (పౌరశాస్త్రం); సైకాలజీ (మనస్తత్వశాస్త్రం)
మార్చి 16 గణితం పేపర్-1బి; జువాలజీ (జీవశాస్త్రం); చరిత్ర
మార్చి 18 భౌతికశాస్త్రం (ఫిజిక్స్); అర్థశాస్త్రం (ఎకనామిక్స్); క్లాసికల్ లాంగ్వేజి
మార్చి 20 రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ); కామర్స్ (వాణిజ్యశాస్త్రం); సామాజిక శాస్త్రం (సోషియాలజీ), ఫైన్ ఆర్ట్స్- మ్యూజిక్
మార్చి 24 జియాలజీ; హోం సైన్స్; పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్; లాజిక్, బ్రిడ్జ్‌కోర్సు మ్యాథ్స్ (బైపీసీ విద్యార్థులకు)
మార్చి 26 మోడర్న్ లాంగ్వేజ్; జియోగ్రఫీ
ద్వితీయ సంవత్సరం
మార్చి 10 పార్ట్-2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
మార్చి 12 పార్ట్-1 ఆంగ్లం పేపర్-2
మార్చి 14 పార్ట్-3 గణితం పేపర్-2ఎ; బోటనీ (వృక్షశాస్త్రం); సివిక్స్; సైకాలజీ
మార్చి 17 గణితం పేపర్-2బి; జువాలజీ (జీవశాస్త్రం); చరిత్ర
మార్చి 19 భౌతికశాస్త్రం; అర్థశాస్త్రం, క్లాసికల్ లాంగ్వేజ్
మార్చి 23 రసాయనశాస్త్రం; కామర్స్, సోషియాలజీ, ఫైన్ఆర్ట్స్, మ్యూజిక్
మార్చి 25 జియాలజీ; హోంసైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జికోర్సు మ్యాథ్స్ (బైపీసీ విద్యార్థులకు)
మార్చి 27 మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ
* నైతిక, మానవ విలువల పరీక్ష 28-1-2015న ఉదయం 10 గంటల నుంచి 1 దాకా జరుగుతుంది
* పర్యావరణ విద్య పరీక్ష 31-1-2015న ఉదయం 10 నుంచి 1 దాకా జరుగుతుంది
* ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 12 నుంచి మార్చి 4 దాకా జరుగుతాయి.
* ఇవే తేదీలు వృత్తివిద్యా పరీక్షలకు కూడా వర్తిస్తాయి. అయితే వాటి సమయపట్టికను విడిగా ప్రకటిస్తారు.

 
Comments Off on వేర్వేరుగానే ఇంటర్ పరీక్షలు

Posted by on November 14, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: