RSS

ఉపాధ్యాయులకు ప్రత్యేక తరగతులు!

02 Oct

ఉపాధ్యాయులకు ప్రత్యేక తరగతులు!
* కసరత్తు చేస్తున్న విద్యాశాఖ
ఈనాడు, హైదరాబాద్: లెక్కలు ఎలా చెప్పాలి? విద్యార్థులకు చరిత్ర పాఠాలు ఎలా బోధించాలి? మారిన పుస్తకాల నేపథ్యంలో సర్కారు ఉపాధ్యాయులకు సరికొత్త పాఠాలు చెప్పాలని కొత్త ప్రభుత్వం యోచిస్తోంది. ఈమేరకు తాజా నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో ఈ జిల్లాలోని ఉపాధ్యాయులకు ఈ తరగతులు మొదలు కానున్నాయి. దీని కోసం రాజీవ్ మాధ్యమిక శిక్షా అభియాన్ ఏర్పాట్లు చేస్తోంది.
ఆ పుస్తకాలే కీలకం…
వాస్తవంగా ఏటా పాఠ్యపుస్తకాల్లో మౌలికమైన మార్పులు చేస్తున్నారు. నలుపు, తెలుపు పుస్తకాల స్థానంలో రంగుల పేజీలు వచ్చాయి. దీనితోపాటు పాఠాన్ని విద్యార్థులకు బోధించే సమయంలో ప్రశ్నలు వేసి దాని ద్వారా సమాధానాన్ని రాబట్టి మరీ పాఠాన్ని మొదలు పెట్టే విధానాన్ని కొత్తగా మొదలు పెట్టారు. అయితే పదో తరగతిలో ఫలితాలు తగ్గుతున్న దరిమిలా తొమ్మిదో తరగతి నుంచే విద్యార్థులకు మెరుగైన పాఠాలు చెప్పించాలని సర్కారు యోచిస్తోంది. ఈ క్రమంలో ఆ తరగతికి చెందిన అన్ని విషయాల్లో విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వడానికి ప్రణాళికల్ని సిద్ధం చేసింది. వచ్చేనెల 13 నుంచి 25 వరకు ఒక బంధానికి, ఆ తర్వాత 16 నుంచి 18వ తేదీల్లో రెండు బంధానికి ఈ విషయంలో శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రాజీవ్ మాధ్యమిక శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఆయా ఉపాధ్యాయులకు కావాల్సిన కరదీపికలను సిద్ధం చేస్తోందని అధికారులు చెప్పారు.

 
Comments Off on ఉపాధ్యాయులకు ప్రత్యేక తరగతులు!

Posted by on October 2, 2014 in Uncategorized

 

Comments are closed.