RSS

Monthly Archives: October 2013

సుభాష్‌కు రామన్‌ ఫెలోషిప్‌!


 

 

* ‘అమెరికా’ ప్రయోగాలకు అనుమతి
కడప నగరం, న్యూస్‌టుడే :
యోగివేమన విశ్వవిద్యాలయం సూక్ష్మ జీవ శాస్త్ర సహాయాచార్యులు డాక్టర్‌ ఎం.సుబోష్‌చంద్రబోస్‌ రామన్‌ఫెలోషిప్‌కు ఎంపికై విశ్వవిద్యాలయ ఘనత పెంచారు. విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) ఈ ఫెలోషిప్‌ను అందచేసింది. భారతదేశంలోని యువశాస్త్ర వేత్తలు అంతర్జాతీయ పరిశోధనారంగంలో ఆధునిక పరిశోధనా పద్ధతులు, అందులో మెలకువలను ఆకళింపు చేసుకొని దేశంలో పరిశోధనల తీరును మెరుగుపరుస్తారు. అంతర్జాతీయ స్థాయికి అనుసంధానం చేయటానికి రామన్‌ఫెలోషిప్‌ తొలిసారిగా యోగి వేమ‌న వ‌ర్సిటీలో డాక్టర్‌ సుభోష్‌చంద్రకు రావటం విశేషం. ఈ ఫెలోషిప్‌ కింద ఆయనకు 3000 అమెరికన్‌ డాలర్లు అందుతాయి
.
* రామన్‌ఫెలోషిప్‌ కింద సుభోష్‌చంద్రకు అమెరికా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అక్కడి మ్యాడిసన్‌ పట్టణంలోని ‘అటవీ ఉత్పత్తుల ప్రయోగశాల’లో ఏడాది పాటు ప్రయోగాలు నిర్వహించేందుకు అనుమతి లభించింది. 1907లో ఏర్పాటు చేసిన ఈ ప్రయోగశాల నేడు జీవ వ్యర్థపదార్థాలు- జీవ ఇంధనాలపై కొనసాగే పరిశోధనలలో ప్రపంచంలోనే ఒక అగ్రగామి సంస్థగా పేరుంది. ఆ విశ్వవిద్యాలయంలోని జీవశాస్త్ర ఇంజినీరింగు విభాగంలో పనిచేస్తున్న ఆచార్య జున్‌యాంగ్‌జుతోపాటు డాక్టరు భోస్‌ పరిశోధనలో పాల్గొంటారు. ‘బయోలాజికల్‌ డిటాక్సిఫికేషన్‌ ఆఫ్‌ లిగ్నోసెల్లు లేసెస్‌ హైడ్రోలైసేట్స్‌ టు ఎన్‌హాన్స్‌ బయోఇథనాల్‌ డిటాక్సిఫికేషను /సెల్యులోసిక్‌ ఇథనాల్‌ ప్రొడక్షన్‌’ అనే అంశంపై సుభోష్‌ పరిశోధనలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు జీవ వ్యర్థపదార్థాల నుంచి జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేయటం ద్వారా వాతవరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని చెప్పారు. ఫెలోషిప్‌ రావటం పట్ల ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్‌ హర్షం వ్యక్తం చేశారు.

 

Advertisements
 
1 Comment

Posted by on October 31, 2013 in Uncategorized

 

సగం మంది ఎస్టీలకు చదువు శూన్యం


ఈనాడు-హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీల అక్షరాస్యత అధ్వానంగా ఉందని జాతీయ జనాభా గణన ప్రాథమిక నివేదిక నిగ్గుతేల్చింది. రాష్ట్రంలో గిరిజన అక్షరాస్యత దేశంలో అత్యల్పంగా నమోదైంది. ఎస్సీల అక్షరాస్యత చివరి నుంచి అయిదో స్థానానికి పరిమితమైంది. రాష్ట్ర సగటు కూడా చివరి నుంచి ఆరో స్థానంలో ఉంది. ఈ 2011 జనాభా గణన నివేదికను కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 30న ఆన్‌లైన్‌లో ఉంచింది. దాని ప్రకారం.. రాష్ట్ర జనాభాలో 23 శాతం దాకా ఎస్సీ,ఎస్టీలున్నారు. ఎస్టీల్లో 49.2 శాతం మంది మాత్రమే అక్షరాస్యులు. బీహార్, ఒడిశాల కంటే మన రాష్ట్రంలో ఎస్టీల అక్షరాస్యత తక్కువగా ఉంది. ఎస్సీలలో 62.3 శాతం మాత్రమే అక్షరాస్యులున్నారు. అత్యధికంగా కేరళలో 88 శాతానికి పైగా అక్షరాస్యులున్నారు. రాష్ట్ర సగటు 67.7 ఉండగా మనకన్నా 22 రాష్ట్రాలు ముందున్నాయి.

 
Comments Off on సగం మంది ఎస్టీలకు చదువు శూన్యం

Posted by on October 31, 2013 in Uncategorized

 

ఐఐటీ గెలుపు బాట!


శ్రేష్ఠమైన ఇంజినీరింగ్‌ విద్యాబోధనకు ఐఐటీలు ప్రసిద్ధి. వాటి ప్రవేశానికి నిర్వహించే పరీక్షల్లో ర్యాంకు కోసం లక్షలమంది విద్యార్థులు అవిశ్రాంతంగా కష్టపడుతుంటారు. వీరు తమ లక్ష్యం సూటిగా, సులువుగా చేరుకోవటానికి ఉపకరించే అంశాలేమిటి?
ఐఐటీ ప్రవేశాలకోసం దరఖాస్తు చేసుకున్న మొత్తం విద్యార్థులు, అర్హులైన విద్యార్థులు, బాలికలు, బాలికల్లో అర్హులైనవారి సంఖ్య- ఈవిధంగా ఏ విశ్లేషణ చూసుకున్నా ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. మొదటి నుంచీ మనరాష్ట్రంలో ఇంజినీరింగ్‌, మెడికల్‌ విభాగాల వైపున్న అధిక మోజే దీనికి ముఖ్యకారణమని చెప్పవచ్చు. అంటే విద్యార్థి మనసులో బలమైన కోరిక ఏర్పరచుకోగలిగితే ఏ పోటీ పరీక్షలో అయినా కచ్చితంగా నెగ్గవచ్చని ఈ విశ్లేషణలు రుజువు చేస్తున్నాయి.
పెరుగుతున్న బాలికల నిష్పత్తి
ఎంపీసీ అంటే బాలురు, బైపీసీ అంటే బాలికలు అనే భావన గతంలో బలంగా ఉండేది. అయితే క్రమంగా బాలికలు కూడా ఎంపీసీ వైపు పెరిగి నేడు ఒక స్థాయికి వచ్చారు. అయితే మున్ముందు బాలికల సంఖ్య పెరగాల్సిన అవసరముంది. 1990లలో బాలుర, బాలికల నిష్పత్తి దాదాపు 10:1 ఉండేది. 2000 నాటికి ఇది 7:1గా, 2005కు 4:1గా వచ్చింది. 2012లో బాలికలకు పరీక్ష ఫీజు మొత్తం రాయితీ ప్రభావంతో 2:1కి చేరింది. అయితే 2013లో మరలా బాలుర సంఖ్య పెరిగి 3:1 అయింది. అయితే నిష్పత్తి 3:1 ఉన్నప్పటికీ ఐఐటీల్లో చేరిన బాలుర, బాలికల శాతాలు వరుసగా 93.5%, 6.5% అయింది. అంటే బాలికల శాతం చాలా తక్కువగా ఉంది. దీనికి ముఖ్య కారణం- బాలికలు అధిక ఒత్తిడిని తట్టుకోలేకపోవడమే.
గ్రామీణ విజయం
గ్రామీణ పట్టణ ప్రాంత విద్యార్థులను పోల్చినపుడు అధిక శాతం పట్టణాల నుంచే సీట్లు సాధిస్తున్నారు. వీటిలో కూడా ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు గ్రామీణ ప్రాంతం వారు కూడా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కొంచెం అధిక శాతమే సీట్లు సాధించగలిగారు. అంటే ఈ పరీక్షపై అవగాహన గ్రామీణ విద్యార్థులు కూడా ఏర్పరచుకోగలుగుతున్నారు. కాబట్టి వీరిలో విజయాల రేటు క్రమంగా పెరుగుతూ వస్తోంది.
రిజర్వేషన్‌, కటాఫ్‌ మార్కులు
ఐఐటీల్లో కేటగిరీ వారీగా ర్యాంకులు ఇస్తున్నారు. కాబట్టి ఏ కేటగిరీలో కూడా విద్యార్థులు నష్టపోయే అవకాశం లేదు. జనరల్‌ కేటగిరీకి 50.5%, ఓబీసీ-నాన్‌ క్రీమిలేయర్‌కు 27%, ఎస్‌సీ విద్యార్థులకు 15%, ఎస్‌టీ విద్యార్థులకు 7.5% సీట్లు కేటాయిస్తారు. పైన చెప్పిన ప్రతి కేటగిరీలో కూడా 3% సీట్లు పీడబ్ల్యూడీ (పర్సన్స్‌ విత్‌ డిజెబిలిటీ) అంటే వికలాంగ విద్యార్థులకు కేటాయిస్తారు. ఏ కేటగిరీలో కూడా ఐఐటీల్లో లభ్యమయ్యే సీట్లకు 1.4 రెట్లు విద్యార్థులు కనీస అర్హత సాధించకపోతే ఆ కేటగిరీలలో ఈఎంఎల్‌ అంటే ఎక్స్‌టెండెడ్‌ మెరిట్‌ లిస్టు తయారుచేస్తారు. గతంలో ఎస్‌సీ, ఎస్‌టీలలో ఈ అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఎస్‌సీలలో కావాల్సిన విద్యార్థుల కంటే అధిక విద్యార్థులే అర్హత సాధించారు కాబట్టి ఈఎంఎల్‌ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అధికంగా వికలాంగుల కేటగిరీలోనే అధికంగా సీట్లు మిగిలిపోతున్నాయి కాబట్టి వాటిలో ఈఎంఎల్‌ లిస్టు ఇస్తున్నారు.
వివిధ కేటగిరీల్లో క్వాలిఫయింగ్‌ మార్కులు
* సబ్జెక్టు పరంగా జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు 10%, ఓబీసీ- ఎన్‌సీఎల్‌ విద్యార్థులకు 9%, ఎస్‌సీ/ ఎస్‌టీ/ పీడీ విద్యార్థులకు 5% మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. అదేవిధంగా మొత్తం మార్కులకు జనరల్‌ కేటగిరీకి 35%, ఓబీసీ- ఎన్‌సీఎల్‌ విద్యార్థులకు 31.5%, ఎస్‌సీ/ ఎస్‌టీ/ పీడీ విద్యార్థులకు అయితే 17.5% మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు.
* ఈ మార్కులను అధిగమించడం ఏ విద్యార్థికయినా సులభమే. అంటే సబ్జెక్టు పరంగా మొత్తం ప్రశ్నల్లో 3 లేదా 4 ప్రశ్నలు చేయగలిగితే కటాఫ్‌ మార్కు సాధించినట్లే. రిజర్వేషన్‌ ఉన్న విద్యార్థులు కొన్ని నియమిత అంశాలకు మాత్రమే పరిమితమై చదివినా కూడా మంచి ర్యాంకుతోనే సీటు సాధించుకునే అవకాశముంది.
* ఈ అర్హత మార్కు సాధించి, సీటు కూడా పొందాలంటే ఆ విద్యార్థి కచ్చితంగా ఇంటర్‌ పరీక్షలో తొలి 20 శాతంలో ఉండి తీరాలి. ఈ కటాఫ్‌ 20 పర్సంటైల్‌ కటాఫ్‌ మార్కు అనేది గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌కు గరిష్ఠంగా 92% వచ్చింది. ఈ సంవత్సరం పరీక్షపై అవగాహన ఇంకా పెరుగుతోంది కాబట్టి 93/ 94% మార్కులు సాధిస్తేనే తొలి ఇరవై పర్సంటైల్‌లో ఉండే అవకాశం ఉంటుంది.
జేఈఈ- మెయిన్స్‌ – జేఈఈ- అడ్వాన్స్‌డ్‌:
* జేఈఈ -అడ్వాన్స్‌డ్‌లో ఎంపికైన విద్యార్థులను చూస్తే వీరిలో దాదాపు అందరూ జేఈఈ -మెయిన్‌లో విజయం పొందినవారే. జేఈఈ- మెయిన్‌ కంటే అత్యధిక శాతం విద్యార్థులకు జేఈఈ- అడ్వాన్స్‌డ్‌లో మార్కులు తగ్గాయి.
* జేఈఈ- మెయిన్‌లో 30 ప్రశ్నలు ఉంటున్నాయి. అడ్వాన్స్‌డ్‌లో 20 ప్రశ్నలుంటున్నాయి. అంటే అర్థం ప్రశ్నల్లో క్లిష్టత అడ్వాన్స్‌డ్‌లో ఎక్కువగా ఉన్నట్లే. జేఈఈ- మెయిన్‌లో ఎక్కువ ప్రశ్నలు ఒక కాన్సెప్టుపై ఆధారపడి ఉంటాయి. అదే జేఈఈ- అడ్వాన్స్‌డ్‌లో అయితే ఒకటి కంటే ఎక్కువ కాన్సెప్టులను కలుపుతూ ఇచ్చే ప్రశ్నలు ఎక్కువగా ఉంటున్నాయి.
* జేఈఈ- మెయిన్‌లో 300 మార్కులు దాటిన విద్యార్థులు 44 మంది ఉంటే వారిలో ఏ ఒక్కరు కూడా జేఈఈ- అడ్వాన్స్‌డ్‌లో మెయిన్‌ మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించలేదు. అంటే జేఈఈ- అడ్వాన్స్‌డ్‌లో బాగా రాణించాలని అనుకున్నపుడు ప్రథమంగా వారు జేఈఈ- మెయిన్‌ పరీక్షకు బాగా తయారుకావాలి.
జేఈఈ- మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ విశ్లేషణ:
జేఈఈ- అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులందరి మార్కులు జేఈఈ- మెయిన్‌లో 40% పైగా ఉన్నాయి. జేఈఈ- మెయిన్‌ 40 శాతం పైగా మార్కులు సాధిస్తే వారు ఎన్‌ఐటీల్లో సీటు సాధించినట్లే. ఇక్కడ విద్యార్థి గ్రహించాల్సింది- మొదట జేఈఈ- మెయిన్‌లో బాగా రాణించడం అంటే ఒక కాన్సెప్టుపై గట్టి పట్టు సాధించుకోవడం. ఇది ఏర్పరచుకోగలిగితే బహుళ కాన్సెప్టు ప్రశ్నలపై కొంత తర్ఫీదు పొందగలిగితే జేఈఈ- అడ్వాన్స్‌డ్‌లో కూడా విజయం సాధించినట్లే.
ఎలా తయారవ్వాలి?
ఏ పోటీపరీక్షకైనా ప్రాథమికంగా కావలసింది- ప్రాథమిక అంశాలపై మంచి అవగాహన, పట్టు ఏర్పరచుకోవడం. దానికి కావాల్సినది ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం. ఇప్పుడు ఇంటర్మీడియట్‌ సిలబస్‌ సీబీఎస్‌ఈ సిలబస్‌ ఆధారంగానే మారింది. కాబట్టి పాఠ్యపుస్తకాలు కూడా ఎన్‌సీఈఆర్‌టీ ఆధారంగానే ఉన్నాయి. విద్యార్థి మొదట చేయాల్సినది ఎన్‌సీఈఆర్‌టీ XI, XIIవ తరగతి పుస్తకాలను పూర్తిగా చదవటం. వాటిలో ఉన్న అన్ని ప్రశ్నల జవాబులూ గుర్తించేలా ప్రణాళిక వేసుకోవాలి. ఈ పుస్తకాలను సరిగా చదవగలిగితే 50 శాతం పైగా మార్కులు సాధించినట్లే. ఇంటర్‌ మార్కుల ప్రాధాన్యం పెరిగింది కాబట్టి పాఠ్యపుస్తకాలను సరిగా చదవగలిగితే ఇంటర్‌లో కూడా నూరు శాతం మార్కులు సాధించే అవకాశం ఏర్పడుతుంది.
* ఇక పోటీపరీక్షలకు తయారయ్యే పుస్తకాలు అన్నప్పుడు విద్యార్థి ఒక్కొక్క అభ్యాసానికి ఒక్కొక్క పుస్తకాన్ని ఆధారంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల నష్టపోయే ప్రమాదముంది. వీలైనంత వరకు ఒక పుస్తకానికి మాత్రమే పరిమితమై దానిలో ప్రశ్నలను పునశ్చరణ చేస్తే సబ్జెక్టుపై పట్టు పెరుగుతుంది.
* గత సంవత్సరం ప్రశ్నల విశ్లేషణ చూస్తే- అధిక ప్రశ్నలు సులభంగానే ఉన్నాయి. అందుకే ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లలో సగటు మార్కు 26, 22, 22గా ఉన్నాయి. ప్రశ్నలు చాలా కఠినంగా ఉంటాయని ఒక ప్రశ్నపై అధిక సమయాన్ని నష్టపోయే బదులు ఆ సమయాన్ని జవాబు సాధించగల ప్రశ్నలకు కేటాయించటం తెలివైన పని.
* ఎంపీసీ విద్యార్థులు కెమిస్ట్రీలో ఎక్కువ ప్రశ్నలు గుర్తుంచుకోవాలి కాబట్టి వాటిని చదవబుద్ధి కావడం లేదని చెప్తారు. కానీ, వాటిపై కొద్ది సమయాన్ని వెచ్చించగలిగితే పరీక్ష సమయంలో అధిక ప్రశ్నలను తక్కువ సమయంలో గుర్తించవచ్చు. ఈ సమయాన్ని మిగిలిన ప్రశ్నలకు ఉపయోగించగలిగితే విద్యార్థి ఎక్కువగా లాభపడే అవకాశముంటుంది.
వ్యవధి మూడునెలలే!
సన్నద్ధతకు ఇక మిగిలిన సమయం మూడు నెలలు మాత్రమే. ఈ వ్యవధిలో మొదట ప్రథమ సంవత్సర సిలబస్‌ పునశ్చరణ పూర్తిచేసుకోవాలి. దీనిని డిసెంబరు మొదటి వారంలోపు పూర్తి చేసుకోగలిగితే అక్కడ నుంచి ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియట్‌ పరీక్షలకూ, పోటీ పరీక్షలకూ కలిపి తయారు కావచ్చు. జూనియర్‌ ఇంటర్‌ ఇప్పుడు పూర్తి చేయలేకపోతే ముందు పూర్తిచేసే అవకాశమే లేదు.
* ఒక్కో అధ్యాయం వెయిటేజీ గతంలో ఏ విధంగా ఉందో అవగాహన ఏర్పరచుకోగలిగితే తయారీ సులువవుతుంది. ఉదాహరణకు- ఫిజిక్స్‌లో ఎలక్ట్రిసిటీ నుంచి 30%, ఆధునిక భౌతిక శాస్త్రం నుంచి 11%, ఆప్టిక్స్‌ నుంచి 4%, తరంగాలు నుంచి 7%, ప్రథమ సంవత్సర మెకానిక్స్‌ నుంచి 35% ప్రశ్నలుంటున్నాయి. దీన్ని గుర్తిస్తే ఏ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి చదవాలో అర్థమవుతుంది. ఈ సమయంలో అధ్యాపకుల బోధన కంటే వ్యక్తిగత అభ్యాసానికి అధిక ప్రాధాన్యం ఇస్తే మంచిది.
* ప్రాథమిక అంశాలపై పట్టు ఏర్పరచుకోవడానికి అధ్యాపకుని సహాయం తీసుకోవాలి కానీ ప్రశ్నల సాధనలో ఏ విద్యార్థి అయినా తనంతట తానే సాధించే దిశలో కృషి చేయాలి. అప్పుడు సబ్జెక్టుపై అవగాహన పెరిగి పరీక్ష సమయంలో సరైన జవాబులు వేగంగా గుర్తించే అవకాశం ఉంటుంది.

 
Comments Off on ఐఐటీ గెలుపు బాట!

Posted by on October 30, 2013 in Uncategorized

 

డైట్‌సెట్ ఇక…డీఈఈసెట్


* రెండు రోజుల్లో డైట్‌సెట్ కౌన్సెలింగ్ తేదీల వెల్లడి
ఈనాడు-హైదరాబాద్: డీఎడ్ ప్రవేశాలు వచ్చే ఏడాది (2014) నుంచి నిర్ణీత వ్యవధిలోనే ప్రారంభమై..ముగిసేలా ప్రాథమిక విద్యా శాఖ అక్టోబరు 28న అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. ప్రతి ఏడాది మాదిరిగానే…ఈ ఏడాదీ ఇప్పటివరకు డీఎడ్ కౌన్సెలింగ్ మొదలేకాలేదు. మరో రెండు, మూడురోజుల్లో డీఎడ్ ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించబోతున్న ప్రాథమిక విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య వచ్చే ఏడాది నుంచి సమయం వృథాకాకుండా ఉండేలా..అవసరమైన జాగ్రత్తలతో ఉత్తర్వులను జారీచేశారు. ఈ ఉత్తర్వుల జారీకి ముందు పూనం మాలకొండయ్య కళాశాలల యాజమాన్యాలతో సమావేశమై చర్చించారు.
ఇప్పటివరకు డైట్‌సెట్ (డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్)గా పిలుస్తున్నారు. ఇకపై డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈసెట్)గా పిలువబోతున్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) గతంలో రెండేళ్ల డీఎడ్ కోర్సును డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్‌గా పిలిచేది. ఇప్పుడు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌గా నామకరణం చేసింది. దీనికి అనుగుణంగా ఈ మార్పు జరిగింది.
* మార్చి చివరి వారంలో ప్రవేశాల ప్రకటన జారీ
* మే మొదటి వారంలో ప్రవేశ పరీక్ష
* మే మూడో వారంలో ఫలితాల విడుదల
* మే చివరి వారంలో అనుబంధ కళాశాలల జాబితా ఖరారు
* మే చివరి వారంలో రాష్ట్ర విద్య పరిశోథన శిక్షణ సంస్థ అకడమిక్ క్యాలెండర్ ప్రకటన జారీ
* తొలివిడత వెబ్ కౌన్సెలింగ్ జూన్ మొదటి వారం లేదా రెండో వారంలో ఆరంభం
* జూన్ మూడు నుంచి నాలుగో వారంలోగా మలివిడత కౌన్సెలింగ్
* జులై మొదటి వారంలో మిగిలిన సీట్లను మైనార్టీ కళాశాలల్లో వారితోనే భర్తీ ప్రకటన జారీ
* జులై రెండో వారం నుంచి నాలుగో వారంలోగా ప్రత్యక్ష పద్ధతిలో సీట్ల భర్తీ (కన్వీనర్ కార్యాలయాన్ని సంప్రదించాలి)
* ఆగస్టులో తరగతులు ఆరంభం.

 
Comments Off on డైట్‌సెట్ ఇక…డీఈఈసెట్

Posted by on October 30, 2013 in Uncategorized

 

Human error halts IIIT faculty recruitment


Hyderabad, October 30:The faculty recruitment of three IIITs has come to a grinding halt following a complaint- said to be by a former minister- who alleged that some irregularities have taken place. As many as 85 people, who were given offer letters, are now in a state of uncertainty. The recruitment was stopped at the eleventh hour as C Damodara Rajanarasimha, Deputy Chief Minister and Minister for Higher Education ordered for a high-level probe.

Following his instructions, the Department of Higher Education has asked the Vice Chancellor of RGUKT- the governing body of three IIITs at Basara, Idupulapaya and Nuziveedu- not to go ahead with the recruitment process until further orders.There are primarily two issues. One is the allegation of not following the reservation system and another one that same pay scale and benefits for different levels of posts viz Assistant Professor and Lecturer.

The RGUKT has taken up the recruitment process several months back after getting due permission from the government. As many as 438 posts were to be filled up for both engineering and non-engineering wings. The faculty positions for engineering were taken up first but a mistake in the GO added to the confusion. In engineering section, there will be no post which is called as ‘lecturer’ and all the lower level faculty is addressed as ‘Assistant Professor’. But the GO, by mistake reportedly mentioned as lecturer. The pay-scale of lecturer and Assistant professor was mentioned as same.

“It was a small human error and we brought the same to the notice of Higher Education Department. But it was not rectified. We clubbed both and issued the notification which has sparked objections. The complainant stated that without getting a corrigendum from the government on the lecturer issue, it is wrong to take up recruitment” explained Prof RV Raj Kumar, Vice Chancellor of the RGUKT.“The second allegation of not following the reservation policy is totally untrue. The reservation roster that we have followed was vetted by both the Social Welfare Department and BC Welfare Department and they found no deviations. So, by all means, both the allegations were untenable. I wonder why the complainant chose to raise this issue now at the end of the process- keeping mum at the time of issuance of notification” Raj Kumar told The Hans India. We have already answered to the some of the queries of Higher Education department and I am hopeful that it would give us go ahead soon, he added.

 
Comments Off on Human error halts IIIT faculty recruitment

Posted by on October 30, 2013 in Uncategorized

 

విశాఖ మార్కెట్‌లోకి ‘ఐ టాపర్‌’


సిరిపురం, న్యూస్‌టుడే: ఆప్‌థాట్స్‌ ఐటీ సాఫ్ట్‌వేర్‌ సంస్థ నూతనంగా రూపొందించిన ‘ఐ టాపర్‌’ టాబ్లెట్‌ పీసీని విశాఖ మార్కెట్‌లోకి విడుదల చేసింది. అక్టోబ‌రు 29న టైకూన్‌ హోటల్లో జరిగిన విలేకర్ల సమావేశంలో సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి రఘునందన్‌, తదితరులు ఈ పీసీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ టాబ్లెట్‌ పీసీ ఇంటర్మీడియట్‌ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. గణితం, జీవశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం వంటి సబ్జెక్టుల్లో విద్యార్థులు లోతైన అధ్యయనం చేసేందుకు ఈ పీసీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఏయూ కంప్యూటర్‌ సైన్స్‌, సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌ విభాగ ఆచార్యులు లతా భాస్కరీ మాట్లాడుతూ ఈ టాబ్లెట్‌ పీసీ ద్వారా అందిస్తున్న ఫీచర్లు విద్యార్థుల చదువుకు ఉపకరిస్తాయన్నారు.

 

 
Comments Off on విశాఖ మార్కెట్‌లోకి ‘ఐ టాపర్‌’

Posted by on October 30, 2013 in Uncategorized

 

ఎందుకు.. ఎలా..!


* ఆకట్టుకుంటున్న వైజ్ఞానిక ప్రదర్శన
పటాన్‌చెరు: శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరుగుతున్న మార్పులను అంది పుచ్చుకున్నప్పుడే జీవితంలో అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఇందుకు విద్యార్థులకు వైజ్ఞానిక ప్రదర్శనలు వేదికలుగా మారుతుంటాయి. కొత్తకొత్త పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఇందుకు వేదికగా జోనల్‌స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిలుస్తోంది.
    
పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌ గురుకుల కళాశాలలో జోనల్‌స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ‘వై-హౌ 2013’ పేరిట అక్టోబ‌రు 29న ప్రారంభమైంది. ఇది మూడు రోజుల పాటు జరుగుతుంది. అక్టోబ‌రు 31న ముగుస్తుంది. జిల్లా కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ ప్రారంభించారు. మెదక్‌తో సహా హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన 98 కళాశాలల విద్యార్థులు హాజరయ్యారు. ప్రస్తుతం మనిషి నిత్య జీవితంతో పెనవేసుకున్న వివిధ అంశాలకు సంబంధించిన నమూనాలు ప్రదర్శించారు. ప్రతిదీ ఆలోచింపజేసేలా ఉంది. వ్యర్థాల వినియోగం, నీటి ఆదా మార్గాలు, వివిధ దేశాల రకాల కరెన్సీ సేకరణ, వ్యాయామం చేసే పరికరం నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేయడం వంటి నమూనాలను విద్యార్థులు ప్రదర్శించి శభాష్‌ అనిపించుకుంటున్నారు.
న్యూక్లియర్‌ రియాక్టర్‌తో విద్యుత్తు.. : రాథోడ్‌వాసుదేవ, గౌతమ్‌చవాన్‌, నారాయణఖేడ్‌
తక్కువ ఖర్చుతో విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశాలు ఏర్పడ్డాయి. అణుపదార్థంతో వెలువడే శక్తిని ఉపయోగించి న్యూక్లియర్‌ రియాక్టర్‌తో విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు. కేన్సర్‌ వంటి రోగాలను తక్కువ మోతాదులో అణు ధార్మిక శక్తి వినియోగించి తగ్గించవచ్చు. కిరణాలను శరీరంపై ప్రసరింపజేస్తే రోగాలు తగ్గుతాయి.
ఇంటి వ్యర్థాలతో కంపోస్టు : దివ్య, విజయ, తాండూరు
ఇళ్ల నుంచి వెలువడుతున్న వ్యర్థాలను ఆవరణలో ఇష్టానుసారంగా పారబోస్తున్నారు. దీనివల్ల దోమలు పెరగడంతో పాటు రోగాల బారిన పడుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ సమస్య నివారణకు వ్యర్థాలతో వర్మికంపోస్టు ఎరువు తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే చిన్న సైజు డబ్బా పెట్టుకొని వ్యర్థాలు దానిలో వేసి తరవాత కంపోస్టుగా రూపొందించవచ్చు.
ఉప్పుతో ముప్పు : జ్యోత్స్న, ఇబ్రహీంపట్నం
మనిషి జీవితంలో ఉప్పు అధికంగా వాడితో ముప్పు ఏర్పడుతుందని తేల్చారు. థైరాయిడ్‌, అధిక రక్తపోటు, గుండెనొప్పి, గుండె పోటు వంటి దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఆరోగ్యాన్నిచ్చే పండ్లు : ప్రియాంక, సంపూర్ణ , నార్సింగి
నిత్యం తీసుకునే ఆహారంలో వివిధ రకాల పండ్లు భుజిస్తే ఆరోగ్యకరంగా ఉంటామని తేల్చారు. కూరగాయలతో కూడిన భోజనం చేసినప్పుడు అరుగుదల బాగుంటుంది. కాబట్టి విటమిన్‌-సి ఉన్న రకాలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటే నిత్యం ఆరోగ్యకరంగా ఉంటాం.
జిల్లేడు పూలతో విద్యుత్తు : శోభ, నార్సింగి
పొలాల్లో వృథాగా వదిలేసేది జిల్లేడు పూలే. ఇప్పుడు వాటిక్కూడా ప్రాధాన్యం పెరిగిపోయింది. జిల్లేడు కాండాలు, పూల రేకలు విడదీసి నుజ్జుగా చేయాలి. దాన్ని మూడు డబ్బాల్లో వేయాలి. వాటిల్లో కాపర్‌, జింకులకు చెందిన రేకులు ఉంచాలి. వాటికి మూడు దశల్లో తీగలు తగిలిస్తే విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది. దాన్ని గడియారానికి అనుసంధానిస్తే బ్యాటరీ లేకుండా అది పనిచేస్తుంది.
వాకింగ్‌ యంత్రంతో విద్యుత్తు : సుమన్‌, ఇబ్రహీంపట్నం
వ్యాయామానికి వినియోగిస్తున్న వాకింగ్‌ యంత్ర పరికరం ప్రయోజనకరంగా మారుతోంది. నడిచే సమయంలో యంత్రం తిరుగుతుంది. దానికి చిన్నపాటి టర్బైన్‌ పరికరం అమర్చారు. టర్బైన్‌లో చక్రం అమర్చారు. యంత్రంపై ఒక్కసారి అడుగు వేస్తే చక్రం వంద సార్లు తిరుగుతుంది. దాని ద్వారా విద్యుత్తు ఉత్పత్తి జరగడానికి డైనమిక్‌ పరికరం ఏర్పాటు చేశారు.
శరీరంలో ఇన్ని మార్పులా : మాధురి, శిరీష ములుగు
ఉప్పు మోతాదుకు మించి వాడటం వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులు ప్రత్యక్షంగా చూపించారు. వివిధ రకాల పరికరాలతో శరీరాకృతిని తయారు చేసి ఉప్పు మోతాదుకు మించి వాడడం వల్ల రక్త వేగం ఏ విధంగా ఉంటుందో విద్యుత్తు దీపాల కాంతులతో ప్రత్యక్షంగా ప్రదర్శించారు. మన శరీరంలో ఇన్ని మార్పులు జరుగుతాయా అనిపించే రీతిలో రూపొందించారు. ఈ నమూనా కలెక్టర్‌ను విశేషంగా ఆకట్టుంది.
రాబోయేది రోబోల కాలమే : మమత, మౌనిక, రంజి, శిరీష, చిట్కుల్‌
ఇక భవిష్యత్తు అంతా రోబోల కాలమే అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన రోబోను ప్రదర్శించారు. ఏదైనా వస్తువు కావాలనుకుంటే దాని వద్దకు రోబో తానే నిదానంగా వెళుతుంది. అవసరం లేదనుకుంటే వేగంగా కదులుతుంది. ఇది తల్లిదండ్రులను అమితంగా ఆకట్టుకుంది.
ఇదో రకం ప్రత్యేకత: నీహారిక, చిట్కుల్‌
వివిధ దేశాల కరెన్సీ నోట్లు విభిన్నంగా ఉన్నాయి. బంగారం, వెండి, రాగిలతో తయారు చేసిన నాణేలు, దేశీయంగా వెయ్యి రూపాయల నాణెం ఆకట్టుకున్నాయి. డబ్బు తీసుకోవడానికి ప్లాస్టిక్‌ కార్డులు వినియోగించుకునే విధానాన్ని విభిన్నంగా ప్రదర్శించారు.

 
Comments Off on ఎందుకు.. ఎలా..!

Posted by on October 30, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: