RSS

Monthly Archives: January 2014

‘రూసా’ కింద రూ.2600 కోట్లతో ప్రతిపాదనలు


ఈనాడు-హైదరాబాద్: రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) ద్వారా రాష్ట్ర ఉన్నత విద్య రూపురేఖలు మారబోతున్నాయి. కొత్తగా విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలలు రాబోతున్నాయి. అధ్యాపకుల నియామకాలు జరగబోతున్నాయి. ప్రభుత్వ కళాశాలలు సైతం బలోపేతం కాబోతున్నాయి. ఈ పథకంలో తొలివిడత కింద 2,600 కోట్ల రూపాయలమేర నిధులు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు అనుసరించి ఉన్నత విద్యా శాఖ తగిన ప్రతిపాదనలతో నివేదిక సిద్ధంచేసింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంబంధిత దస్త్రంపై సంతకంపెట్టిన వెంటనే కేంద్ర మానవ వనరుల శాఖకు ఈ నివేదికను ఆన్‌లైన్ ద్వారా సమర్పించేందుకు ఉన్నత విద్యా మండలి సిద్ధంగా ఉంది. ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది.

 
Comments Off on ‘రూసా’ కింద రూ.2600 కోట్లతో ప్రతిపాదనలు

Posted by on January 30, 2014 in Uncategorized

 

PLEASE FIND THE ATTACHMENTS REGARDING THE STUDY MATERIAL IN ENGLISH FOR JR. INTERMEDIATE IPE 2014


Rc. No. 1657 4. Grammar 3. Mosaic 2. Poetry 1. Prose

 
Comments Off on PLEASE FIND THE ATTACHMENTS REGARDING THE STUDY MATERIAL IN ENGLISH FOR JR. INTERMEDIATE IPE 2014

Posted by on January 30, 2014 in Uncategorized

 

“Lead India Teacher – The Nation Building Programme” School Education – Model Schools – Integrating “Lead India Teacher – The Nation Building Programme” – Conducting District Level Training Programmes to the Principals and Teachers of Model Schools in the State – Orders issued – Reg


procs. 1835

 
2 Comments

Posted by on January 30, 2014 in Uncategorized

 

పాఠ్యపుస్తకాల ధరలకు రెక్కలు!


* పేద, మధ్యతరగతి కుటుంబాలపై పెరగనున్న భారం
ఈనాడు, హైదరాబాద్‌: పాఠ్య పుస్తకాల ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి. కాగితం ధర పెరగడం, నాణ్యత పెంపునకు తీసుకున్న చర్యల వల్ల ధరల పెంపు తప్పడంలేదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చర్యతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరగనుంది. కిందటేడాది ప్రతిపేజికి 17.5 పైసలు కాగా..ఇది 29 పైసలకు చేరుకుంటుందని అంచనా.
    ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యాశాఖ పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందచేస్తోంది. గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివే విద్యార్థులు మాత్రం బహిరంగ విపణిలో కొనుగోలు చేయాలి. ఈ పుస్తకాల అమ్మకాల బాధ్యతను టెండర్ల ద్వారా ఎంపిక చేసిన సంస్థలకు విద్యాశాఖ అప్పగిస్తోంది. టెండర్ల ఖరారు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఒకసారి ధర నిర్ణయం జరిగితే మూడేళ్ల వరకు అమల్లో ఉంటోంది. ఆ ప్రకారం రానున్న విద్యా సంవత్సరం (2014-15) నుంచి 2016-17 వరకు ప్రస్తుతం ఖరారు చేయబోతున్న ధరలే ఉంటాయి. కాగితం ధర పెరిగినందువల్ల పుస్తకాల ధరల పెంపు కాస్త ఎక్కువైందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. రూ.37 వేలుగా ఉండే మెట్రిక్‌ టన్ను కాగితం ధర ప్రస్తుతం రూ.65,503లకు పెరిగింది. పన్నులతో ఇది మరింత ఎగసింది. మరోపక్క ఈ దఫా పుస్తక విక్రేతల నుంచి గతంలో కంటే ఎక్కువగా రాయల్టీ పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పుస్తక విక్రయ ధరల పెంపు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలో అధికారిక ఉత్తర్వులు రానున్నాయని విద్యా శాఖ వర్గాలు వెల్లడించాయి.
ఒకటి నుంచి రెండో తరగతి వరకు మూడు పాఠ్య పుస్తకాలు, 3,4,5 తరగతులకు నాలుగేసి పుస్తకాలు, ఆరేడు తరగతులకు ఆరు, ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ఏడేసి వంతున పుస్తకాలు ఉన్నాయి.
                  
కిందటేడాది వరకు పుస్తకాల ముద్రణ పంపిణీలో తీవ్ర జాప్యం జరిగేది. అయితే..ఈ దఫా పాత కథ పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రాథమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య గట్టి చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్లే ఫిబ్రవరి, మార్చిలో మొదలయ్యే పుస్తకాల ముద్రణ పనులు ఇప్పటికే మొదలుకావడమే కాకుండా జిల్లాలకు సరఫరా సైతం జరిగిపోతోంది. నిల్వలో ఉన్న ఉచిత పాఠ్యపుస్తకాలు పోగా 5.07 కోట్ల పుస్తకాలు ముద్రించాల్సి ఉంది. ఇందులో మంగళవారం వరకు 58 లక్షల పాఠ్యపుస్తకాలు ముద్రించారు. వాటిలో 48.64 లక్షల పుస్తకాలు జిల్లా కేంద్రాలకు సరఫరా చివరిదశలో ఉంది. రానున్న విద్యా సంవత్సరం నుంచి మారబోతున్న పదో తరగతి పాఠ్య పుస్తకాలను త్వరితగతిన ముద్రించి విద్యార్థులకు అందుబాటులో ఉంచేందుకు ప్రాథమిక విద్యా శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

 
Comments Off on పాఠ్యపుస్తకాల ధరలకు రెక్కలు!

Posted by on January 30, 2014 in Uncategorized

 

ఎవరూలేని అభాగ్యులకు చదువుకునే అవకాశం


* జనన ధ్రువీకరణ పత్రాలు జారీ
* ఎస్సీలకు వర్తించే విద్యా రాయితీల వర్తింపు
* ప్రయోగాత్మకంగా రాజధాని నగరంలో అమలు
* ఇక్కడ విజయవంతమైతే మిగతా జిల్లాల్లో..!
ఈనాడు, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి: వారు దిక్కూ మొక్కూలేని అనాథలు.. ఎక్కడ పుట్టారో.. తల్లిదండ్రులు ఎవరో తెలియని పరిస్థితి. భవిష్యత్తు అగమ్యగోచరమైన ఇలాంటి నిర్భాగ్యుల జీవితాల్లో విద్యా వెలుగులు నిండనున్నాయి. వీరికి పూర్తిస్థాయిలో ప్రభుత్వ తోడ్పాటును అందించేందుకు రాష్ట్ర రాజధానిలో అధికారులు సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో వేలాది మంది అనాథలకు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడమే కాకుండా జీవితంపై వారికి భరోసా కల్పించనున్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా మొదలుపెట్టనున్న ఈ కార్యక్రమంలో.. విద్యాపరంగా ఎస్సీలకు వర్తింపజేసే రాయితీలన్నీ వీరికి వర్తింపజేయాలని నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో అనాథలు.. ప్రభుత్వ అనాథ శరణాలయాలు, తదితర చోట్ల ఆశ్రయం పొందుతున్నారు. ఒక్క రాజధాని నగరంలోనే వీరి సంఖ్య 20 వేలదాకా ఉంటుందని అంచనా. ఎప్పుడు పుట్టారో తెలియక పోవడంతో వీరికి అధికారికంగా జనన ధ్రువీకరణ పత్రాలు కూడా ఉండటం లేదు. దీంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక తోడ్పాటుగానీ, విద్యాపరంగా ఇతరత్రా సహకారంగానీ లభించని పరిస్థితి నెలకొంది. విద్యాపరంగా షెడ్యూల్‌ కులాలకు ఇచ్చే అన్ని రకాల సౌకర్యాలను వీరికి ఇవ్వొచ్చంటూ ప్రభుత్వం పదేళ్ల కిందటే ఆదేశాలు జారీ చేసినా కలెక్టర్లు పట్టించుకోలేదు. కొద్దిమంది మాత్రమే విద్యార్జన చేస్తుండగా చాలామంది చదువులకు దూరంగా ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ముఖేష్‌ కుమార్‌ మీనా ఈ అంశంపై దృష్టిసారించారు. నగరంలో అనాథలు ఎంతమంది ఉన్నారో పరిశీలించే బాధ్యతను అదనపు సంయుక్త కలెక్టర్‌ రేఖారాణికి అప్పగించారు. మొదటి దశ కింద ఏపీ బాలసదన్‌లోని 189 మంది అనాథలకు జనన ధ్రువీకరణ పత్రాలను జారీచేయాలని కలెక్టర్‌ నిర్ణయించారు. ముందుగా హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ నుంచి వీరికి ఎలాంటి జనన ధ్రువపత్రాలు లేవని ధ్రువీకరించుకుంటారు. ఆ తర్వాత ప్రత్యేక వైద్యుల బృందం సాయంతో దంత పరీక్షలు నిర్వహిస్తారు. దంతాల ఎదుగుదల ఆధారంగా వయసును నిర్ధరించి జులైలో పుట్టినట్లు ఒక తేదీని నిర్ణయించి అందరికీ జనన ధ్రువపత్రాలను జారీ చేస్తారు. గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా వీరందరికీ ఎస్సీలకు అందించే విద్యాపరమైన రాయితీలను వర్తింపజేసేలా ప్రత్యేకంగా ధ్రువపత్రాలను కూడా ఇస్తారు. ఉపకార వేతనాల నుంచి ఉన్నత విద్య వరకు అన్నింటినీ వీరికి వర్తింపజేసి ఉన్నత చదువుల దిశగా పయనింప చేయడమే కాకుండా ఆ తరువాత ఉద్యోగ భరోసాను కల్పించేందుకూ ప్రయత్నాలు సాగుతున్నాయి. మొదటి విడతలో 189 మందికి వర్తింపజేసిన తర్వాత రాజధాని నగరంలో మిగతావారి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చి అందరికీ అవకాశం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ ముఖేష్‌కుమార్‌ మీనా ‘ఈనాడు’కు తెలిపారు. ఇది అనేక మందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే కార్యక్రమమైనందున వెంటనే అమలయ్యేలా చూస్తున్నామన్నారు. ఈ అనాథలకు ఎలాంటి సర్టిఫికెట్‌ లేదనే వివరాలతో ధ్రువీకరణ జారీ చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు అంగీకరించారని అదనపు సంయుక్త కలెక్టర్‌ రేఖారాణి తెలిపారు. దీనిపై కమిటీ ఏర్పాటు చేసి అనాథలకు తోడ్పాటు అందించే ప్రణాళికను కొద్ది రోజుల్లోనే అమలు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియ ఇక్కడ విజయవంతంగా అమలైతే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

 
Comments Off on ఎవరూలేని అభాగ్యులకు చదువుకునే అవకాశం

Posted by on January 30, 2014 in Uncategorized

 

2nd list of TGT’s(around 1000 memebrs) will be appointed with in a month.there is a possibility that 1st list TGT’s can avail sliding.with in a month or 2 we may get a G.O regarding D.A and I.R.


2nd list of TGT’s(around 1000 memebrs) will be appointed with in a month.there is a possibility that 1st list TGT’s can avail sliding.with in a month or 2 we may get a G.O regarding D.A and I.R.

 
Comments Off on 2nd list of TGT’s(around 1000 memebrs) will be appointed with in a month.there is a possibility that 1st list TGT’s can avail sliding.with in a month or 2 we may get a G.O regarding D.A and I.R.

Posted by on January 30, 2014 in Uncategorized

 

ఉపాధ్యాయ విద్యపై నిఘా..నాణ్యత మెరుగుకు ప్రాథమిక విద్యా శాఖ చర్యలు


ఉపాధ్యాయ విద్యపై నిఘా..నాణ్యత మెరుగుకు ప్రాథమిక విద్యా శాఖ చర్యలు
హైదరాబాద్: విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాల్సిన ఉపాధ్యాయుల్లో నాణ్యత తగ్గుతోంది. తూతూ మంత్రం చదువులతో టీచర్ పట్టాతో స్కూళ్లలోకి అడుగుపెడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేస్తున్నారు! ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల్లో నాణ్యత లోపించడం, నిబంధనలు పాటించకపోవడాన్ని ప్రాథమిక విద్యాశాఖ గుర్తించింది. ముఖ్యంగా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) ప్రైవేటు కాలేజీల్లో తరగతులు జరక్కపోయినా ఉపాధ్యాయ శిక్షణ కోర్సు పూర్తి చేస్తున్నారు. ప్రాక్టికల్ తరగతులు నిర్వహించకపోయినా బాగా బోధిస్తారంటూ కాలేజీలు సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నాయి. దీంతో ముందు ఇక్కడి నుంచి సంస్కరించడం ప్రారంభించాలని ప్రాథమిక విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డీఎడ్ ప్రైవేటు కాలేజీల్లో పక్కా బోధన అందించేందుకు ప్రత్యేక నిఘావంటి పకడ్బందీ చర్యలకు సిద్ధమైంది. అందులో భాగంగా వెబ్ ఆధారిత పర్యవేక్షణ చేపట్టనున్నామని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ‘సాక్షి’తో చెప్పారు. అలాగే, జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్గా రెవెన్యూ, విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు డీఎడ్ కాలేజీలు ఇప్పటికే 600 వరకు ఉన్నందున కొత్త కాలేజీలకు అనుమతి ఇవ్వొద్దని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి (ఎన్సీటీఈ) రాశామని చెప్పారు.

డీఎడ్ కాలేజీల్లో పర్యవేక్షణ ఇలా..
-ప్రత్యేక వెబ్సైట్లో విద్యార్థులు, అధ్యాపకుల ఫొటోలతో వివరాలు .
– రోజువారీ హాజరు వివరాలను ప్రతినెలా ఆ సైట్లో అప్లోడ్ చేయాలి. పాఠ్యాంశాల వివరాలను కూడా పొందుపరచాలి.
– అధిక ఫీజులు డిమాండ్ చేస్తే విద్యార్థులు ఫిర్యాదు చేయవచ్చు. జిల్లా కలెక్టర్, విద్యా శాఖ అధికారులు వీటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు.
– కలెక్టర్ చైర్మన్గా ఉండే కమిటీలు ప్రతి నెలా కాలేజీలను తనిఖీలు చేస్తాయి. సంబంధిత కాలేజీ అనుబంధ స్కూళ్లలో ప్రాక్టికల్స జరిగాయా? లేదా? పరిశీలిస్తాయి. టీచర్ల హాజరు, పాఠ్యాంశాల బోధనపై రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదికలిస్తాయి. ఈ చర్యల ద్వారా పాఠశాల విద్య నాణ్యత మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు పూనం మాలకొండయ్య తెలిపారు.

ఏప్రిల్లోనే ‘టెన్త్’ పాఠ్యపుస్తకాల పంపిణీ
పదో తరగతి విద్యార్థులకు పాఠశాలలు ముగిసేలోపే పాఠ్యపుస్తకాలు అందనున్నాయి. ఇప్పటికే ఉచిత పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభమైందని, పాఠశాలలకు చివరి పని దినమైన ఏప్రిల్ 23కే పదో తరగతికి వెళ్లే 12 లక్షల మంది విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందిస్తామని పూనం మాలకొండయ్య చెప్పారు. సెలవుల్లో ముందుగానే చదువుకునే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టామన్నారు. ఇతర తరగతులకు చెందిన 64 లక్షల మందికి జూన్ 12న స్కూళ్లు తెరిచే రోజున ఉచిత పుస్తకాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

 
Comments Off on ఉపాధ్యాయ విద్యపై నిఘా..నాణ్యత మెరుగుకు ప్రాథమిక విద్యా శాఖ చర్యలు

Posted by on January 29, 2014 in Uncategorized

 

ఐఐటీ హైదరాబాద్‌కు జపాన్ రుణం


ఐఐటీ హైదరాబాద్‌కు జపాన్ రుణం
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో కొన్నేళ్ళకిందట కొత్తగా ఏర్పాటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) దశ తిరగబోతోంది. జపాన్ అంతర్జాతీయ సహాకార సంస్థ (జె.ఐ.సి.ఎ.) హైదరాబాద్ ఐఐటీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికిగాను 1336 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈమేరకు జె.ఐ.సి.ఎ. ప్రతినిధి షిన్యా ఎజిమా, భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి రాజేశ్ కుల్లార్‌లు జనవరి 29న ఒప్పందంపై సంతకాలు చేశారు. శాశ్వత ప్రాంగణ నిర్మాణానికి, అత్యున్నతస్థాయి పరిశోధన పరికరాల కొనుగోలుకు ఈ రుణాన్ని వెచ్చిస్తారు. 2018కల్లా ఈ పనులన్నీ పూర్తవుతాయని భావిస్తున్నారు.

 
Comments Off on ఐఐటీ హైదరాబాద్‌కు జపాన్ రుణం

Posted by on January 29, 2014 in Uncategorized

 

31న పర్యావరణ విద్యపై పరీక్ష


31న పర్యావరణ విద్యపై పరీక్ష

* మార్చి 12 నుంచి ఇంటర్ పరీక్షలు ఆరంభం

* బోర్డు కార్యదర్శి రామశంకరనాయక్ స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ బోర్డు పరీక్షలకు ఉపక్రమించింది. ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణలో భాగంగా జనవరి 31న ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పర్యావరణ విద్య పరీక్ష జరగనుంది. ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ పరీక్షలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలి. గత 2007 నుంచి ఎవరైనా ఈ పరీక్ష రాయకుండా ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకరనాయక్ వెల్లడించారు. నాటి హాల్‌టిక్కెట్ నంబరుతో ఈ పరీక్ష రాయవచ్చునని చెప్పారు. ఈ మేరకు జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్లు పేర్కొన్నారు.

తొలుత ప్రకటించిన విధంగానే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చి 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ముందుగా జరగవచ్చునని వస్తున్న ప్రచారాన్ని కార్యదర్శి కొట్టేశారు. తొలుత నిర్ణయించిన తేదీల్లోనే పరీక్షలు జరుగుతాయని స్పష్టంచేశారు. ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి మొదలై.. మార్చి 4 వరకు జరగనున్నాయి. ఈ దఫా 19 నాన్-పారామెడికల్ వొకేషనల్ విద్యార్థులకు కంప్యూటరైజ్డ్ ప్రశ్నపత్రాన్ని (ప్రాక్టికల్స్ కోసం) కళాశాలలకు పంపనున్నారు. ప్రశ్నపత్రాన్ని గతేడాది వరకు స్థానికంగానే అధ్యాపకులు తయారుచేసేవారు. ఈ సారి నుంచి మార్పు తీసుకొచ్చారు.

 
Comments Off on 31న పర్యావరణ విద్యపై పరీక్ష

Posted by on January 29, 2014 in Uncategorized

 

శిశువులకు స్త్రీ విద్య శ్రీరామరక్ష!


శిశువులకు స్త్రీ విద్య శ్రీరామరక్ష!
ఐక్యరాజ్యసమితి: స్త్రీ విద్య అనేది ప్రాణరక్షణ వంటిదని ఐక్యరాజ్యసమితి నివేదిక జనవరి 29న పేర్కొంది. ముఖ్యంగా, భారత్, నైజీరియాల్లో స్త్రీవిద్య పెరిగితే అసంఖ్యాక ప్రాణాలు నిలబడతాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న శిశుమరణాను చూస్తే…భారత్, నైజీరియాల్లో ఈ పరిస్థితి అత్యంత అధికంగా ఉంది. ఈ పరిస్థితి నుంచి బైటపడాలంటే కచ్చితంగా స్త్రీవిద్యావ్యాప్తి పట్ల దృష్టిసారించాల్సి ఉందని పేర్కొంది.

 
Comments Off on శిశువులకు స్త్రీ విద్య శ్రీరామరక్ష!

Posted by on January 29, 2014 in Uncategorized