RSS

Daily Archives: November 12, 2013

ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్పు..తొలిరోజు మాతృభాష సబ్జెక్టు పరీక్ష


హైదరాబాద్:ఇంటర్ప్రథమ, ద్వితీయసంవత్సరాలపరీక్షలషెడ్యూలులోమార్పుచోటుచేసుకోనుంది. మొదటిరోజునేఇంగ్లిష్పరీక్షఉండడంవల్లకొందరువిద్యార్థుల్లోకలిగేభయాన్నిపోగొట్టేందుకుఇంటర్మీడియట్విద్యాకమిషనరేట్చర్యలుచేపట్టింది. పరీక్షలమొదటిరోజునమాతృభాషసబ్జెక్టుపరీక్షలేనిర్వహించాలన్నకమిషనరేట్ప్రతిపాదనకుసెకండరీవిద్యాముఖ్యకార్యదర్శిరాజేశ్వర్తివారీఓకేచెప్పినట్లుతెలిసింది. ఒకటి, రెండురోజుల్లోసవరించినషెడ్యూలునుప్రభుత్వంప్రకటిస్తుంది.

ఇంటర్ప్రాక్టికల్స్జంబ్లింగ్కుస్వస్తి!
ఇంటర్మీడియెట్ప్రాక్టికల్పరీక్షల్లోజంబ్లింగ్విధానంఅమలునుఈసారికూడాఆపేయాలనిప్రభుత్వంనిర్ణయానికివచ్చింది. 2009 నుంచిప్రాక్టికల్పరీక్షలనుజంబ్లింగ్విధానంలోనిర్వహించాలనిభావించినావివిధకారణాలతోఅప్పటినుంచిఏటావాయిదావేస్తూవస్తోంది. సారీజంబ్లింగ్వాయిదాపైనేమొగ్గుచూపుతోంది. దీనిపైరెండురోజుల్లోఅధికారికప్రకటనవిడుదలకానుంది.

 
Comments Off on ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్పు..తొలిరోజు మాతృభాష సబ్జెక్టు పరీక్ష

Posted by on November 12, 2013 in Uncategorized

 

ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటుచేయాలి


ఈనాడు-హైదరాబాద్: ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటుచేయాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త మండలి (జాక్టో) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేసింది. జాక్టో నేతల సమావేశం ఎస్టీయూ భవన్‌లో నవంబరు 12న జరిగింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయులకు సంబంధించిన వివిధ సమస్యల పరిష్కారం గురించి చర్చించారు.
* తరగతుల తేదీల వాయిదావేయాలి
ఉపాధ్యాయుల పునశ్చరణ తరగతుల తేదీలను వాయిదావేయాలని పీఆర్టీయూ తెలంగాణ టీచర్స్ యూనియన్ రాజీవ్ విద్యా మిషన్ అధికారులకు విజ్ఞప్తిచేసింది. 4, 5, 6, 7 తరగతులకు బోధనచేస్తున్న ఉపాధ్యాయులకు కొత్త పాఠ్యపుస్తకాలు, విద్యా హక్కు చట్టం అమలుపై అవగాహన కోసం ఈ నెల 15, 16, 17 తేదీల్లో శిక్షణ జరపాలని రాజీవ్ విద్యా మిషన్ నిర్ణయించింది. అయితే..మొహరం, కార్తీక మాసం ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకోని తరగతులను ఆ తరువాత తేదీల్లో జరపాలని కోరింది.

 
Comments Off on ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటుచేయాలి

Posted by on November 12, 2013 in Uncategorized

 

2017 నాటికి 13 లక్షల అధ్యాపకుల కొరత


ఈనాడు-హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపకుల కొరత తీవ్రరూపం దాల్చనుంది. 2017 సంవత్సరం నాటికి (12వ పంచవర్ష ప్రణాళిక ముగింపు) 13,17,331 మంది అధ్యాపకుల కొరత ఏర్పడుతుందని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర మానవ వనరుల శాఖ ఐటీ విభాగం అధ్యయనం చేయించిన నిపుణుల బృందం అన్ని రకాల ఉన్నత విద్య సంస్థల్లో చదివే, చదవబోయే విద్యార్థుల గణాంకాల ఆధారంగా అధ్యాపకుల కొరతపై గణాంకాలను తయారుచేసింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోకుంటే..ఉన్నత విద్య సంస్థల్లో ప్రవేశాల సంఖ్య పెరిగినా లక్ష్యం ఫలితాలు నిరాశజనకంగానే ఉంటాయని అధ్యయన బృందం కేంద్రాన్ని నవంబరు 12న హెచ్చరించింది. ఉన్నత విద్య మండలి కార్యాలయంలో కేంద్ర మానవ వనరుల శాఖ అధికారిక బృందం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అధ్యాపకుల కొరతను అధిగమించకుంటే సమస్యలు మరింత ఉద్ధృతమవుతాయని హెచ్చరించింది.

 
Comments Off on 2017 నాటికి 13 లక్షల అధ్యాపకుల కొరత

Posted by on November 12, 2013 in Uncategorized

 

18లోగా ఇంటర్ ఫీజు చెల్లించాలి


ఈనాడు-హైదరాబాద్: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫీజు చెల్లింపు తేదీని ఇంటర్ బోర్డు పొడిగించింది. రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 18వ తేదీలోగా ఫీజు చెల్లించవచ్చునని ఓ ప్రకటనలో తెలిపింది.

 
Comments Off on 18లోగా ఇంటర్ ఫీజు చెల్లించాలి

Posted by on November 12, 2013 in Uncategorized

 

కాకినాడ ట్రిపుల్‌ఐటీకి ప్రైవేటు భాగస్వామ్యం ఖరారు!


ఈనాడు, హైదరాబాద్‌: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటుకానున్న ట్రిపుల్‌ఐటీకి ప్రైవేటు భాగస్వామి సంస్థ పేరు ఖరారైనట్లు సమాచారం. జీఎంఆర్‌, శ్రీ కౌండిన్య ఎడ్యుకేషనల్‌ సొసైటీ, రాజమండ్రి, అశోకా బిల్డ్‌కాన్‌ లిమిటెడ్‌ (నాసిక్‌) సంస్థలు కన్సార్టియంగా ఏర్పడి ప్రైవేటు భాగస్వామ్యంగా ఉండేందుకు దరఖాస్తుచేశాయి. నిశిత పరిశీలన అనంతరం ఈ కన్సార్టియంనే అధికారిక కమిటీ ఎంపిక చేసినట్లు తెలిసింది.కేంద్ర ప్రభుత్వం పబ్లిక్‌ ప్రైవేట్‌ బాగస్వామ్య పద్ధతిలో ఏర్పడే ట్రిపుల్‌ఐటీ కోసం రూ.128 కోట్లు కేటాయిస్తుంది. ఇందులో 65% కేంద్రం, 35% రాష్ట్ర ప్రభుత్వం, భాగస్వామ్యంగా ఉండేందుకు ముందుకొచ్చిన సంస్థ రూ.19.2 కోట్లు వ్యయంచేయాల్సి ఉంటుంది.

 
Comments Off on కాకినాడ ట్రిపుల్‌ఐటీకి ప్రైవేటు భాగస్వామ్యం ఖరారు!

Posted by on November 12, 2013 in Uncategorized

 

విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టిపెట్టాలి


ఈనాడు-హైదరాబాద్:
పాఠశాలలకు విద్యార్థులు వచ్చేలా ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను ప్రాథమిక విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదేశించారు. విద్యార్థులు 224 పాఠశాలల పనిదినాల్లో కనీసం 180 నుంచి 200 రోజుల వరకు వచ్చేలా చూడాలని కోరారు. రాజీవ్ విద్యా మిషన్ రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయంలో నవంబరు 11న ఆర్జేడీలు, డీఈఓలు, ఆర్వీఎం ప్రాజెక్టు ఆఫీసర్లకు విద్యా హక్కు చట్టం అమలుపై జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి పూనం మాలకొండయ్య మాట్లాడారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, పఠనానైపుణ్యాన్ని పెంచేందుకు బుక్‌డిపాజిట్ కేంద్రాలను జిల్లాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. పాఠశాలల్లో క్రమం తప్పకుండా సమయానుసారం ప్రార్థన నిర్వహించాని, టీచర్ల హాజరు క్రమం తప్పకుండా చూడాలని పేర్కొన్నారు. రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు డైరెక్టర్ వి.ఉషారాణి మాట్లాడుతూ..విద్యా హక్కు చట్టం ప్రకారం కిలోమీటరు పరిధిలోపు పాఠశాల ఉండాలని ఇందుకు అనుగుణంగా జిల్లా స్థాయిలో పి.ఒ., డి.ఇ.ఒ. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 
Comments Off on విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టిపెట్టాలి

Posted by on November 12, 2013 in Uncategorized

 

ప్రైవేటు భాగస్వామ్యంలో కాకినాడ ట్రిపుల్ఐటీ


ఈనాడు, హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటుకానున్న ట్రిపుల్ఐటీకి ప్రైవేటు భాగస్వామి సంస్థ పేరు నవంబరు 11న ఖరారైనట్లు సమాచారం. జీఎంఆర్, శ్రీ కౌండిన్య ఎడ్యుకేషనల్ సొసైటీ, రాజమండ్రి, అశోకా బిల్డ్‌కాన్ లిమిటెడ్ (నాసిక్) సంస్థలు కన్సార్టియంగా ఏర్పడి ప్రైవేటు భాగస్వామ్యంగా ఉండేందుకు దరఖాస్తుచేశాయి. నిశిత పరిశీలన అనంతరం ఈ కన్సార్టియంనే అధికారిక కమిటీ ఎంపిక చేసినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ బాగస్వామ్య పద్ధతిలో ఏర్పడే ట్రిపుల్ఐటీ కోసం రూ.128 కోట్లు కేటాయిస్తుంది.

 
Comments Off on ప్రైవేటు భాగస్వామ్యంలో కాకినాడ ట్రిపుల్ఐటీ

Posted by on November 12, 2013 in Uncategorized

 

ఎంబీబీఎస్‌ యాజమాన్య కోటాకు ప్రత్యేక పరీక్ష!


ఎంబీబీఎస్‌ యాజమాన్య కోటాకు ప్రత్యేక పరీక్ష!

* విధానాన్ని దాదాపుగా ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
* సీట్ల భ‌ర్తీలో పారదర్శకతకు ఎంసీఐ కసరత్తు
హైదరాబాద్‌: ప్రైవేటు కళాశాలల్లో ఎంబీబీఎస్‌, దంతవైద్య కోర్సుల్లో యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తున్న 40 శాతం సీట్లకు ప్రత్యేకంగా ప్రవేశపరీక్ష నిర్వహించాలన్న విధానం దాదాపుగా ఖరారైంది. ఈ అంశంపై వైద్యవిద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో ప్రైవేటు వైద్యకళాశాలల సంఘం ప్రతినిధులతో న‌వంబ‌రు 11న‌ చర్చలు జరిగాయి. ప్రైవేటు కళాశాలల్లో ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా ప్రవేశపరీక్ష నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని యాజమాన్యాల సంఘం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. ఎంబీబీఎస్‌లో మొత్తం సీట్ల భర్తీకి తమకే అనుమతి ఇవ్వాలన్న సంఘం సూచనను సర్కారు తిరస్కరించింది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ప్రైవేటు వైద్యకళాశాలలన్నీ కలిసి ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. ఈ పరీక్ష పర్యవేక్షణ బాధ్యతలను ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికిగాని, ప్రత్యేకంగా ఒక కమిటీకిగాని అప్పగించే అవకాశముంది. ఆ విశ్వవిద్యాలయం సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రవేశపరీక్ష నిర్వహణకు మార్గదర్శకాల ముసాయిదాను వైద్యవిద్యాశాఖ రూపొందించనుంది. ఈ ముసాయిదాను ముఖ్యమంత్రి ఆమోదించిన తర్వాత ఉత్తర్వులు జారీచేయనున్నారు.
ఫీజు రెట్టింపు కోసం ఒత్తిడి
ప్రస్తుతం ప్రైవేటు కళాశాలల్లో ప్రభుత్వ కోటా కింద భర్తీచేసే ఏ (50 శాతం) కేటగిరీ సీట్లకు రూ.60 వేలు, బీ (10 శాతం) కేటగిరీ సీట్లకు రూ.2.4 లక్షలు, యాజమాన్య కోటా కింద ప్రైవేటు కళాశాలలు భర్తీ చేసుకునే 40 శాతం సీట్లకు రూ.5.5 లక్షల వార్షిక ఫీజు ఉంది. ఈ ఫీజులను 2013-14 విద్యాసంవత్సరంలో పెంచాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో దీన్ని 2014-15కు ఫీజుల నియంత్రణ కమిటీ వాయిదా వేసింది. ఈ ఏడాది ఆలస్యం జరుగకుండా ప్రస్తుతమున్న ఫీజులను రెట్టింపు చేయాలని ప్రైవేటు వైద్యకళాశాలలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. చ‌ర్చల అనంతరం దీనిపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారు.
అక్రమాల‌ను అడ్డుకోవడానికే…
ప్రైవేటు వైద్యకళాశాలల్లో యాజమాన్య కోటా కింద ఒక్కో ఎంబీబీఎస్‌ సీటుకు రూ.50 లక్షలకు పైగా వసూలు చేస్తున్నారు. ఒక్కో సీటుకు రూ.5.50 లక్షలు మాత్రమే తీసుకోవాలని మార్గదర్శకాలున్నా అవి అమలు కావడంలేదు. ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తులు ఇవ్వడం లేదంటూ ఈ ఏడాది దాదాపు 2,459 మంది కోర్టును ఆశ్రయించారు. దరఖాస్తులు ఇచ్చినా, ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులు ఉన్నప్పటికీ సీట్లు ఇవ్వలేదంటూ 700 మంది హైకోర్టులో కేసులు వేశారు. ఈ సీట్ల భర్తీ విధానాన్ని పర్యవేక్షించాల్సిన ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రేక్షకపాత్రకే పరిమితమైంది. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదుల అందినా సరైన చర్యల్లేవనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో న్యాయస్థానాల సూచనల మేరకు యాజమాన్య కోట సీట్ల భర్తీలో పారదర్శకత తీసుకురావడానికి ఒక స్వతంత్ర సంస్థ అధ్వర్యంలో ప్రవేశపరీక్ష నిర్వహించే అంశాన్ని ఎంసీఐ పరిశీలిస్తోంది. సీట్ల భర్తీలో అక్రమాలను నిరోధించడంతో పాటు పారదర్శకత పెంచడానికి వీలుగా కొత్త విధానం తీసుకురావాలని ఎంసీఐ నిర్ణయించింది. రాష్ట్రంలో ఎంబీబీఎస్‌లో మొత్తం 6,200 సీట్లుండగా.. అందులో 3,800 సీట్లు ప్రైవేటు, మైనారిటీ కళాశాలల్లో ఉన్నాయి. వీటిలో యాజమాన్య కోటా కింద దాదాపు 1,600 సీట్లను ఇంటర్మీడియట్‌ మార్కుల ఆధారంగా ప్రైవేటు కళాశాలలు భర్తీ చేసుకుంటున్నాయి. వీటి భర్తీలో పారదర్శకత కోసం ప్రవేశ పరీక్ష విధానం ఉత్తమమని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. లోపాలకు తావులేని కొత్త విధానం తేవాలని సూచిస్తున్నారు.
నిపుణుల సూచనలు…
* యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ప్రస్తుతమున్న ఎంసెట్‌ ర్యాంకుల ప్రాతిప‌దిక‌గా తీసుకుంటే కొత్తగా ప్రవేశపరీక్ష అవసరం ఉండదు.
* ప్రవేశపరీక్ష తప్పనిసరి అయితే, ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో నిర్వహించాలి.
* ప్రభుత్వ పర్యవేక్షణలో పరీక్ష నిర్వహణకు ప్రైవేటు కళాశాలలు అంగీకరించని పక్షంలో, ప్రస్తుత విధానాన్నే కొనసాగించాల్సి వస్తే… ప్రవేశాలకు ఆన్‌లైన్‌ పద్ధతి అమలు చేయాలి.
* విడివిడిగా దరఖాస్తు చేసుకునేలా కాకుండా, అన్ని ప్రైవేటు కళాశాలలకు ఒకే దరఖాస్తు సరిపోయే విధానం తీసుకురావాలి.
* ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు చెందిన ప్రతినిధులతో కమిటీని ఏర్పాటుచేసి, ఆ కమిటీకి ప్రవేశాల ప్రక్రియ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలి.
* దరఖాస్తుల పరిశీలన అనంతరం ప్రతిభ ఆధారంగా అర్హులైన అభ్యర్థుల జాబితాను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో ఉంచాలి.
* అర్హుల జాబితాపై ఫిర్యాదులు, వాటి పరిశీలనకు కనీసం వారం రోజులు గడువు ఇవ్వాలి.
* తుదిజాబితా సిద్ధమైన తరవాత విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో అన్ని కళాశాలలకు ఒకే చోట కౌన్సెలింగ్‌ పద్ధతిలో భర్తీ చేయాలి.

 
Comments Off on ఎంబీబీఎస్‌ యాజమాన్య కోటాకు ప్రత్యేక పరీక్ష!

Posted by on November 12, 2013 in Uncategorized