RSS

Daily Archives: November 17, 2013

దేశంలో విద్యావ్యవస్థ తీరు మారాలి


 

* సూపర్ 30 ఆనంద్‌కుమార్వ్యాఖ్య

 

జంషెడ్‌పూర్: దేశంలో ప్రస్తుత విద్యా వ్యవస్థ ఒకరకంగా ధనవంతులే లక్ష్యంగా ఉందని పాట్నాలోని సూపర్ 30 (ఐఐటీ శిక్షణ సంస్థ) వ్యవస్థాపకుడు ఆనంద్‌కుమార్ నవంబరు 17న అన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జేఈఈ పరీక్షల నిర్వహణ తీరు సరికాదని అది విద్యార్థుల సహజసిద్ధమైన మేధస్సు, సృజనాత్మకతను కొలిచేదిగా ఉండాలని సూచించారు. ఐఐటీల్లో ప్రవేశ పరీక్షలు రాసే అర్హత రెండు సార్లకన్నా ఎక్కువగా ఉండాలన్నారు. ప్రస్తుత పరీక్షల వ్యవస్థ అంతర్జాలంలేని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు కష్టతరంగా మారిందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా విద్యా వ్యవస్థను మార్చాలని కోరారు. సూపర్ 30ని కేవలం 30 మందికే పరిమితం చేయకుండా మరింత మందికి శిక్షణ ఇచ్చేలా మార్చుతున్నామని వివరించారు.

 
Comments Off on దేశంలో విద్యావ్యవస్థ తీరు మారాలి

Posted by on November 17, 2013 in Uncategorized

 

purchase


purchase

 
Comments Off on purchase

Posted by on November 17, 2013 in Uncategorized

 

agreement


Agreement copy

 
2 Comments

Posted by on November 17, 2013 in Uncategorized

 

Providing of Subject teachers


Providing of Subject teachers in needy High Schools on work adjustment instruction

 
Comments Off on Providing of Subject teachers

Posted by on November 17, 2013 in Uncategorized

 

approve d deputn of subjct tchrs


*DEOs with Dist collector wl approve d deputn of subjct tchrs frm PS/UP/HS to HS&Model schools on work adjstmnt basis bfr Nov 20 -DSE Rc7556

 
Comments Off on approve d deputn of subjct tchrs

Posted by on November 17, 2013 in Uncategorized

 

కళాశాలలకు నాక్ గుర్తింపు తప్పనిసరి


* రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ వేణుగోపాలరెడ్డి
అంబేద్కర్ విశ్వవిద్యాలయం (ఎచ్చెర్ల) :
       డిగ్రీ, పీజీ, ఇంజినీరింగు తదితర కోర్సుల్లో నాణ్యమైన బోధనతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు చూపగలమని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఎల్.వేణుగోపాలరెడ్డి అన్నారు. నవంబ‌రు 17న‌ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ అండ్ ప్రాక్టీసెస్’ సంచికను ఆయన ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలోని డిగ్రీ, బీఈడీ కళాశాలల ప్రధానాచార్యులతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘డిగ్రీ, పీజీ, ఇంజినీరింగు విద్య ఎటు పోతోందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఏ కళాశాలలోనూ తగినంత మంది విద్యార్థులు చేరటం లేదు. కోర్సు పూర్తయ్యేసరికి విద్యార్థులు ఉద్యోగం పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను ఆయా కళాశాలలు అందించకపోవటమే దీనికి ప్రధాన కారణం. ఇకనైనా లోపాలను సరిద్దుకొని నాణ్యమైన విద్య అందించటంలో రాజీ లేకుండా ముందుకు సాగాలని’ ఆయన అన్నారు. తగిన సౌకర్యాలు కల్పించి యూజీసీ నుంచి నిధులు కావాలని దరఖాస్తు చేస్తే ఉన్నత విద్యామండలి తరఫున సహకారం అందిస్తామన్నారు. మారిన నిబంధనల ప్రకారం ప్రతి కళాశాలకు యూజీసీ ఇచ్చే నాక్ (నేషనల్ అక్రిడేషన్ కౌన్సిల్) గుర్తింపు తప్పనిసరని పేర్కొన్నారు.

 
Comments Off on కళాశాలలకు నాక్ గుర్తింపు తప్పనిసరి

Posted by on November 17, 2013 in Uncategorized

 

డిసెంబరు ఒకటి నుంచి 12 కళాశాలల్లో ఎన్‌వీఈక్యూఎఫ్


డిసెంబరు ఒకటి నుంచి 12 కళాశాలల్లో ఎన్‌వీఈక్యూఎఫ్

* ఏఐసీటీఈ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎస్.మంథా
* ‘సుప్రీం’ తీర్పుపై కేంద్రానికి నివేదన
ఈనాడు-హైదరాబాద్: వృత్తితో కూడిన విద్యను అందించేందుకు జాతీయ వృత్తి విద్య అర్హతల చట్రం (నేషనల్ వొకేషనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ (ఎన్‌వీఈక్యూఎఫ్) ద్వారా కృషి చేస్తున్నామని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఛైర్మన్ డాక్టర్ ఎస్.ఎస్.మంథా వెల్లడించారు. ఈ పథకం అమలుపై ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల్లో అవగాహన కల్పించేందుకు నవంబరు 16న (శనివారం) ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐసీటీఈ ఛైర్మన్ మంథా విలేకర్లతో మాట్లాడుతూ… డిసెంబరు ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో 12 కమ్యూనిటీ కళాశాలల్లో ఎన్‌వీఈక్యూఎఫ్‌ను అమలు చేయనున్నామని వెల్లడించారు. ఇందులో పది ప్రభుత్వ పాలిటెక్నిక్, రెండు డిగ్రీ కళాశాలలు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా 200 కళాశాలల్లో ఈ వృత్తితో విద్యను నేర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ప్రస్తుతం 4 రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్‌వీఈక్యూఎఫ్‌ను ఏ కళాశాల ద్వారానైనా అమలు చేయవచ్చునని చెప్పారు. తొమ్మిదో తరగతి నుంచి ఏడు స్థాయుల్లో ఈ పథకం అమలు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ విద్యను ప్రారంభించేందుకు సంబంధిత కళాశాలలు, పరిశ్రమల రంగానికి చెందిన వారి మధ్య ఒప్పందాలు జరుగుతాయని వెల్లడించారు. సాధారణ విద్యతో పాటు ఈ పథకాన్ని జోడించినందున ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. దేశవ్యాప్తంగా అనుమతుల్లేని బిజినెస్ స్కూళ్లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్‌తో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశామని వెల్లడించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రారంభానికి ఏఐసీటీఈ అనుమతులు అవసరం లేదని, అది కేవలం సలహాలు మాత్రమే ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తుచేయగా.. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మానవ వనరుల శాఖకు లేఖ రాసినట్లు చెప్పారు. ఏఐసీటీఈ రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన విషయాన్ని గమనించాలని వ్యాఖ్యానించారు.

 
Comments Off on డిసెంబరు ఒకటి నుంచి 12 కళాశాలల్లో ఎన్‌వీఈక్యూఎఫ్

Posted by on November 17, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: