RSS

Daily Archives: November 24, 2013

తల్లిదండ్రుల ఆలోచనల్ని పిల్లలపై రుద్దడం సరికాదు


 

* ఎన్‌ఐఆర్‌డీడైరెక్టర్‌జనరల్‌వెంకటేశ్వరరావు

 

వెంగళరావునగర్‌ (హైదరాబాద్‌): తల్లిదండ్రులు తమ సొంత నిర్ణయాలతో పిల్లలపై ఒత్తిడి పెంచడం సరికాదని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డా. ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. విద్యావికాస్‌ కమిటీ రాజీవ్‌నగర్‌ తృతీయ వార్షికోత్సవ వేడుకలు స్థానిక శ్రీసాయిబాలాజీ నివాస్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటేశ్వరరావు హాజరై ప్రసంగించారు. పిల్లల ఆలోచనలకు అనుగుణంగా వారిలో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన ఈనాడు జర్నలిజం స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఎం. నాగేశ్వరరావు మాట్లాడుతూ పిల్లల్లో ప్రశ్నించే తత్వంతోనే ప్రగతి ప్రారంభమవుతుందని చెప్పారు. మూడేళ్ల కాలంలో చూసినట్లయితే సివిల్స్‌లో రాణించేవారంతా సాధారణ, మధ్యతరగతి కుటుంబాల వారేనని తెలిపారు. వారిలోనూ ఎక్కువమంది మహిళలే ఉంటున్నారన్నారు. నేడు ఇంజినీరింగ్‌ విద్య నాసిరకంగా ఉందని నైపుణ్యంలేని విద్యార్థులు తయారవుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఆ కాలనీకి చెందిన 76 మంది విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కాలనీలోని వాచ్‌మెన్ల పిల్లలు 66 మందికి, 8 మంది పేద విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యావికాస్‌ కమిటీ ఛైర్మన్‌ కృష్ణ శర్మ, ఉపాధ్యక్షులు మూర్తి, ప్రధాన కార్యదర్శి సీవీ రామన్‌, కోశాధికారి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

 
Comments Off on తల్లిదండ్రుల ఆలోచనల్ని పిల్లలపై రుద్దడం సరికాదు

Posted by on November 24, 2013 in Uncategorized