RSS

Daily Archives: November 26, 2013

బరువు తక్కువ పిల్లలు చదువులోనూ బలహీనులే!!


మెల్‌బోర్న్‌: తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు…మున్ముందు పెద్దగా పొడుగు పెరగరు. వారికి స్నేహితులు కూడా చాలా తక్కువగా ఉంటారు. అంతేకాదు, చదువు విషయంలో కూడా తమ వయసు వారితో పోలిస్తే చాలా వెనకబడే ఉంటారని ఒటాగో విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అతి తక్కువ బరువుతో పుట్టి ఇప్పుడు 22-23 సంవత్సరాల వయసు వచ్చిన వారిని పరిశోధకులు తమ అధ్యయనం నిమిత్తం ఎంపిక చేసుకున్నారు. వారి నుంచి రాబట్టిన సమాచారాన్ని చూస్తే వారికున్న స్నేహితులు, ఇతర పరిచయస్తుల సంఖ్య చాలా పరిమితమని స్పష్టమైంది. విద్యవిషయంలో కూడా వారి పనితీరు అంతంతమాత్రమేనని తేలింది. ఉన్నత పాఠశాల స్థాయికి వచ్చిన తర్వాత కూడా పోటీల్లో వారు పాల్గొంటున్న తీరు అత్యంత నిరాశాజనకంగా ఉంది. వారికి వచ్చిన ఉద్యోగాలు…పొందుతున్న వేతనాలు కూడా అదే వయసు ఇతర పిల్లలతో పోల్చి చూస్తే చాలా తక్కువని తేలినట్లు పరిశోధకులు వివరించారు.

 
Comments Off on బరువు తక్కువ పిల్లలు చదువులోనూ బలహీనులే!!

Posted by on November 26, 2013 in Uncategorized

 

ఎథిక్స్‌కు ఎలా సిద్ధమ‌వాలి?


ఎథిక్స్‌కు ఎలా సిద్ధమ‌వాలి?

సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ సిలబస్‌లో చేసిన మార్పుల్లో ప్రధానమైనది ఎథిక్స్‌-ఇంటిగ్రిటీ-ఆప్టిట్యూడ్‌ పేపర్‌ను చేర్చడం. ప్రస్తుత అభ్యర్థులే కాకుండా రాబోయే అభ్యర్థులు కూడా ఈ పేపర్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అభ్యర్థుల ప్రయోజనార్థం యూపీఎస్‌సీ మాదిరి ప్రశ్నల్ని ఇప్పటికే విడుదల చేసింది. ఈ ప్రశ్నపత్రాలు కేవలం సూచనప్రాయమేనన్న విషయాన్నీ స్పష్టం చేసింది.
మాదిరి ప్రశ్నపత్రాల ఆధారంగా ఈ ఎథిక్స్‌ పేపర్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశముందో తెలుసుకోవచ్చు. మాదిరి ప్రశ్నపత్రంలో మార్కులు ప్రస్తావించకపోయినప్పటికీ 8, 6 మార్కులకు చిన్న ప్రశ్నలు, 2 మార్కుల అతి చిన్న ప్రశ్నలు వస్తాయని ఊహించవచ్చు. కేస్‌స్టడీలకు ఎక్కువ ప్రాధాన్యంతోపాటు వాటికే ఎక్కువ మార్కులు కేటాయించే అవకాశముంది.
ఈ పేపర్‌ ఎందుకు ముఖ్యం?
* అన్ని పేపర్లకు సమానంగా మార్కులుంటాయి. వీటన్నింటిలో మంచి మార్కులు తెచ్చుకోవడం ప్రధానం. ఎథిక్స్‌ పేపర్‌కు 250 మార్కులు.
* ఇది కొత్త పేపర్‌ కాబట్టి దీనికి సంబంధించి నిర్దిష్ట మార్గదర్శకాలేమీ లేవు.
* మాదిరి పత్రంగా మనం ఉపయోగించే ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ పేపర్లోనూ ఎథిక్స్‌ లేదు. మిగతా మూడు పేపర్లకు కొన్ని సూచికలున్నా.. ఎథిక్స్‌కు ఆ అవకాశం లేదు.
అభ్యర్థులకు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
* ప్రతి అభ్యర్థీ (ఎక్కువగా చాలాసార్లు రాసినవాళ్లు) మిగతా పేపర్లను బాగా రాసే అవకాశముంది (మిగతావి గత సిలబస్‌లోని భాగమే కదా). కాబట్టి ఎథిక్స్‌ పేపర్లో సాధించిన మార్కులపైనే అభ్యర్థి జయాపజయాలు ఆధారపడతాయని చెప్పొచ్చు.
* ఈ పేపర్‌ గురించిన పూర్తి సమాచారం తెలియకపోవడంతో చాలామంది అభ్యర్థులు పరీక్షరోజున ప్రయత్నిద్దాం అనే ఆలోచనతో ఉన్నారు. ఇది చాలా పొరబాటు. మిగతా పేపర్లలో ఎక్కువ మార్కులు తెచ్చుకుని కూడా ఈ పేపర్లో అర్హతా మార్కులు (యూపీఎస్‌సీ నిర్ణయించిన విధంగా) సాధించకపోతే మీ అభ్యర్థిత్వం పరిగణనలోకి తీసుకోరు.

ఈ పరిస్థితుల్లో సిద్ధమయ్యేదెలా?
మొత్తం సిలబస్‌ను చదివి, అన్ని విభాగాల నుంచి వ‌చ్చే అవకాశమున్న ప్రశ్నలను ఊహించడమే సరైన మార్గం.
8 మార్కులు, 6 మార్కుల ప్రశ్నలు: ఈ ప్రశ్నలు సాధారణ రకానికి చెందినవి. వీటిని కేటాయించిన స్థలంలోనే రాయాల్సి ఉంటుంది. 8 మార్కుల ప్రశ్నకు 125 నుంచి 150 పదాల్లోనూ, 6 మార్కుల ప్రశ్నకు 100 నుంచి 120 పదాల్లోనూ జవాబులు రాయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలు వాస్తవ సంబంధ, జ్ఞానాధారిత/ ప్రముఖ వ్యక్తులకు సంబంధించినవిగా ఉంటాయి.
Probable Questions (Factual or Knowledge based)
1) How do the concepts of love and moral percepts help to build an Ethical society?
2) Outline the salient points outlined in the Code of Ethics adopted by the American Society for Public Administration.
3) “Sun shine is one of the best methods of ensuring a higher standard of Administrative Ethics” . In light of the above statement, justify the movement for a Right to information across the world.
4) Distinguish between Values and Norms . ( 6 marks )
5) Outline the values underlying Indian Culture. ( 8 marks )
6) “The purpose of government is to make it easy for people to do good and difficult to do evil”. Do you think the Code of Conduct for Civil Servants in India facilitates the above maxim? ( 8 marks )
7) Do you think Civil Servants should run for political offices after retirement ? Justify your stand ( 6 marks) Questions based on the lives of individuals
1) Briefly outline the contributions of any two of the following to the ‘ethical fabric’ of Indian Society : (6 marks each)
a) Gautama Buddha b) Manu c) Kabir d) Guru Nanak
2) Who is the Civil Servant has inspired you the most and Why ? Mention the attributes that you would like to imbibe from him .
3) Do you think Jeremy Bentham’s desire to construct a society that would provide for the “greatest good of the “greatest numbers” is practically feasible ?
ఈ ప్రశ్నలన్నిటికీ వాస్తవాధారిత పరిజ్ఞానం అవసరమవుతుంది. కాబట్టి సంబంధిత అంశాలన్నీ అధ్యయనం చేయాలి. జవాబుల్లో ‘సాధారణ’ స్వభావం లేకపోతే మార్కులు పొందటం కష్టం.

– వి. గోపాల‌కృష్ణ, డైరెక్టర్‌, బ్రెయిన్ ట్రీ

యూపీఎస్సీ విడుద‌ల చేసిన న‌మూనా ప్రశ్నప‌త్రం కోసం క్లిక్ చేయండి..

 
Comments Off on ఎథిక్స్‌కు ఎలా సిద్ధమ‌వాలి?

Posted by on November 26, 2013 in Uncategorized