RSS

Daily Archives: November 5, 2013

Image

RMSA Phase – 3


mad

 
Comments Off on RMSA Phase – 3

Posted by on November 5, 2013 in Uncategorized

 

Pune University has grown the second largest


Mumbai, November 5: Pune University has grown larger older counterpart in Mumbai. This year, Pune went on to colleges under its ambit, thus emerging as the second largest country. According to the latest data from the University Grants Hyderabad’s Osmania University is the biggest with 901 University with 811 affiliated colleges comes second, Rashtrasant Maharaj Nagpur University a close third with 800 colleges, and Rajasthan University colleges. The fifth largest Indian public university is Mumbai University with 711 co colleges are the mainstay of the country’s higher education system. They enrol 89.3% students and about 72.2% of postgraduate pupils.
Pune University was established 65 years ago to reach out to students spread across 1 Maharashtra, but its jurisdiction was redrawn later when universities came up in Kolh Yet, its biggest expansion happened recently when many colleges came up in Pune, said Commission member and former Pune University vice-chancellor Narendra Jadhav said, come about in the last 10 years. This growth is not by accident; it is balanced. Of a
travelling to India for education, about 45% come to Pune. Mumbai and Pune universiti comparable.” Just five years ago, the University of Mumbai had 531 affiliated college population of about 6.5 lakh, Pune University had 474 affiliated colleges with 5.5 la Nagpur University had 375 colleges.
Source: The Times of India

 
Comments Off on Pune University has grown the second largest

Posted by on November 5, 2013 in Uncategorized

 

భారత్‌కు రానున్న బ్రిటిష్ బడులు


ముంబయి: బ్రిటన్‌లోని ప్రముఖ పాఠశాలలు మన దేశానికి రానున్నాయి. భారతీయ ఉన్నత పాఠశాలల విద్యార్థులను చేర్చుకునేందుకు ఇవి సిద్ధమవుతున్నాయి. ఉపకారవేతనాలు ఇస్తామనడమే కాకుండా అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకూ హామీ ఇస్తున్నాయి. సెయింట్ బీస్, సెయింట్ క్రిస్టోఫర్స్ వంటి బ్రిటన్‌కు చెందిన 12 బోర్డింగ్ స్కూళ్లు సమాఖ్యగా ఏర్పడి మన దేశంలోని 11 నుంచి 16 ఏళ్ల వయస్సున్న విద్యార్థులను చేర్చుకునేందుకు ముందుకొచ్చాయి. పాఠశాలల వివరాలు, విధివిధానాలు వంటి సమగ్ర సమాచారంతో సమాఖ్య వెబ్‌సైట్‌ను ఈ నెలాఖరుకు ప్రారంభించనున్నారు. ఇందులోభాగంగా విద్యార్థులకు ఆంగ్లం, గణితం, సాధారణ పరిజ్ఞానంలో ఉన్న ప్రావీణ్యాన్ని తెలుసుకునేందుకు ముంబయి, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్ సహా 15 నగరాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు వచ్చే ఫిబ్రవరిలో ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం బ్రిటిష్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశానికి 100మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. భారతీయ విద్యార్థుల్లో చురుకుదనం, కష్టించేతత్వం, నైతిక విలువలు, సామాజిక దృక్పథం ఉన్నందున ఎక్కువమందిని చేర్చుకోవాలనుకుంటున్నామని.. ఈ పాఠశాలల సమాఖ్యను నిర్వహిస్తున్న ఆంగ్లో స్కూల్స్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ప్రిన్సిపల్ డేవిడ్ బాడీ నవంబరు 5న చెప్పారు. సుమారు రూ.2 కోట్ల విలువైన ఉపకారవేతనాలు ఇవ్వనున్నట్లు సమాఖ్య ప్రకటించింది.

 
Comments Off on భారత్‌కు రానున్న బ్రిటిష్ బడులు

Posted by on November 5, 2013 in Uncategorized

 

సమాచార శాఖకు 23 పోస్టులు మంజూరు


ఈనాడు, హైదరాబాద్: సమాచార, పౌర సంబంధాల శాఖకు కొత్తగా 23 పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థికశాఖ నవంబరు 5న ఉత్తర్వులు జారీచేసింది. ఉపసంచాలకులు (డీడీ) 12, సహాయ సంచాలకులు 11 పోస్టులు మంజూరుచేసింది. ప్రస్తుతం జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి (డీపీఆర్వో)గా ఉన్న అధికారులను ఇకనుంచి ‘పౌరసంబంధాల అధికారి’గా పిలుస్తారు. ఇకనుంచి జిల్లాస్థాయి అధికారిగా డీడీ లేదా ఏడీని నియమిస్తారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఉండే అధికారిని ‘అదనపు పౌరసంబంధాల అధికారి’గా పిలుస్తారు. జోన్ స్థాయిలో పనిచేస్తున్న ప్రాంతీయ సంయుక్త సంచాలకుల పోస్టులన్నింటినీ ఇకనుంచి హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయానికి మారుస్తున్నారు. వారితో ఇక్కడ ప్రత్యేక విభాగం ఏర్పాటుచేస్తారు. ఇతర ప్రభుత్వ శాఖలతో ఈ విభాగం అనుసంధానకర్తగా పనిచేస్తుంది.

 
Comments Off on సమాచార శాఖకు 23 పోస్టులు మంజూరు

Posted by on November 5, 2013 in Uncategorized

 

సీమాంధ్రలో ఐఐటీ, ఐఐఎం, 3 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు


 

*కేంద్రమానవవనరులఅభివృద్ధిశాఖసుముఖత

 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో ఐఐటీ, ఐఐఎం, 3 కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ సుముఖత వ్యక్తం చేసింది. తన నిర్ణాయాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కేంద్ర హోంశాఖకు తెలిపింది. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం ఈ నిర్ణయాన్ని పరిశీలించనుంది. సీమాంధ్రలో జాతీయస్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు రూ. 7 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు.

 
Comments Off on సీమాంధ్రలో ఐఐటీ, ఐఐఎం, 3 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు

Posted by on November 5, 2013 in Uncategorized

 

రూ.16.36 కోట్లతో పాఠశాలలకు తాగునీరు


ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో జలమణి పథకం కింద మరో 4005 పాఠశాలలకు తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. తాగునీటి వసతి లేని పాఠశాలలకు రూ.16.36 కోట్లతో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం నవంబరు 5నన ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో పాఠశాలకు రూ.50 వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకూ వ్యయం చేయనున్నారు. రాష్ట్రంలో విశాపట్నం, గుంటూరు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో 4005 పాఠశాలలకు తాగునీటి వసతి కల్పించనున్నారు.

 
Comments Off on రూ.16.36 కోట్లతో పాఠశాలలకు తాగునీరు

Posted by on November 5, 2013 in Uncategorized

 

ఇంజినీరింగ్ విద్యార్థులకు అప్రెంటీస్‌షిప్ అవసరం


* 4 శాతం మందిలోనే నైపుణ్యం
ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్య ప్రాధాన్యం గురించి తెలుసుకోకుండా ఆ కోర్సులో చేరిన విద్యార్థులు ఆలస్యంగా మేల్కొనేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోందన్న ఆందోళన నేడు సర్వత్రా వ్యక్తమవుతోంది. మరోవైపు, తమ వద్ద చేరిన విద్యార్థులను సమర్ధులైన ఇంజినీర్లుగా రూపొందించాల్సిన బాధ్యతను గాలికి వదిలేసి నిర్లిప్తంగా ఉంటున్న కాలేజీల తీరువల్ల కూడా ఈ సమస్య మరింత తీవ్రమవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సబ్జెక్టుపై విద్యార్థికి పూర్తిస్థాయి పట్టు వచ్చేలా కాలేజీల్లో శిక్షణ లభించటం లేదు. ప్రయోగశాలల్లో కూడా విద్యార్థులకు మార్గదర్శకత్వం ఉండడం లేదు. దీంతో నాలుగేళ్ల తర్వాత ఇంజినీరింగ్ పట్టా చేతికొచ్చినప్పటికీ.. విద్యార్థులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితులను మార్చాలంటే.. ఇంజినీరింగ్ విద్యార్థులకు కోర్సులో భాగంగా కొంతకాలం ఏదైనా పరిశ్రమలో అప్రెంటీస్‌గా పని చేయటాన్ని తప్పనిసరి చేయాలని ఒక ఇంజినీరింగ్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ నీలం మేఘ శ్యామ్ దేశాయ్ సూచించారు. ఉపకారవేతనంతో కూడిన అప్రెంటీస్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లయితే.. విద్యార్థులకు క్షేత్రస్థాయి శిక్షణ లభించటమేగాక, పరిశ్రమలకు సుశిక్షితులైన అభ్యర్థులు లభ్యమవుతారని చెప్పారు. అఖిల భారత సాంకేతిక విద్య మండలి నివేదికల ప్రకారం 2012 నాటికి దేశంలో 5,200 వరకు ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. వీటి సంఖ్య ప్రస్తుతం 5,500కు చేరుకొని ఉంటుందని అంచనా. వీటి నుంచి ఏటా సుమారు 15 లక్షల మంది ఇంజినీర్లు బయటకొస్తున్నారు. జాతీయ సాఫ్ట్‌వేర్, సేవల సంస్థల సంఘం (నాస్కామ్) 2012 నివేదిక ప్రకారం 60 శాతం పైన మార్కులు తెచ్చుకున్న ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో కేవలం నాలుగోవంతు మాత్రమే ఉద్యోగాలకు సరిపోతున్నారు. ఇంజినీరింగ్‌లో చేరే విద్యార్థులు ఈ అంశాలన్నింటిపైనా స్పష్టతతోనే కోర్సులో చేరాలని, అప్పుడే నిరాశకు గురికాకుండా, లక్ష్యం చేరుకోవటానికి అవసరమైన ఆత్మస్త్థెర్యంతో ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

 
Comments Off on ఇంజినీరింగ్ విద్యార్థులకు అప్రెంటీస్‌షిప్ అవసరం

Posted by on November 5, 2013 in Uncategorized

 

యువత వ్యవసాయం వైపు మళ్లాలి


 

*ప్రపంచవ్యవసాయసదస్సులోసీఎంపిలుపు

 

ఈనాడు, హైదరాబాద్: విద్యావంతులైన యువత వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామాలకు తరలివెళ్లేందుకు యువతను సన్నద్ధం చేసేందుకు కృషి జరగాలని అన్నారు. నవంబరు 5న హైదరాబాద్‌లో ప్రపంచ వ్యవసాయ సదస్సు ప్రారంభమైంది. దీనికి సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయరంగం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని, వాటిని పరిష్కారాలు కనుగొని, రైతులకు లాభసాటిగా మార్చాలని, ఇందుకోసం విస్తృత పరిశోధనలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. వ్యవసాయాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని సీఎం సూచించారు.

 
Comments Off on యువత వ్యవసాయం వైపు మళ్లాలి

Posted by on November 5, 2013 in Uncategorized

 

తెలంగాణాలో సైనిక పాఠశాలను స్థాపించాలి


ఈనాడు-హైదరాబాద్: రాబోయే తెలంగాణ రాష్ట్రంలో సైనిక పాఠశాలను స్థాపించాలని పీఆర్టీయూ తెలంగాణ నేతలు కేంద్ర మంత్రుల బృందాన్ని (జీఓఎం) నవంబరు 5న కోరారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగానికి 20000 కోట్ల రూపాయలను ఇవ్వాలని, పాఠశాలలను ఒకే యాజమాన్యం కింద తీసుకురావాలని కేంద్ర మంత్రుల బృందాన్ని కోరినట్లు ఎమ్మెల్సీ సుధాకరరెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు జి.హర్షవర్ధన్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

 
Comments Off on తెలంగాణాలో సైనిక పాఠశాలను స్థాపించాలి

Posted by on November 5, 2013 in Uncategorized

 

విజ్ఞానం… అమోఘం


* సైన్స్‌ఫేర్‌లో ఆకట్టుకున్న ప్రదర్శనలు
సర్పవరం జంక్షన్‌, న్యూస్‌టుడే: కాకినాడ గ్రామీణ మండలంలోని పి.వెంకటాపురం ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన జోన్‌-2 సైన్సుఫేర్‌లో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. ప్రతిభకు పదును పెడితే అద్భుతాలు చేయవచ్చని వారు నిరూపించారు. న‌వంబ‌రు 4 నుంచి మూడు రోజులపాటు ఈ ప్రదర్శనలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.
* ఉప్పునీరు నుంచి తాగేనీరు
భూమి మీద మొత్తం నీటిలో మంచినీరు 2 శాతం మాత్రమే ఉంది. మానవాళికి ఆధారమైన తాగునీటిని ఉప్పునీరు ద్వారా తయారు చేయడంపై కృష్ణా జిల్లా కుంటముక్కల పాఠశాలకు చెందిన జి.తేజస్వీ ప్రదర్శన ఇచ్చారు. దీనిపై ఆ బాలిక ఆంగ్లంలో చెప్పిన విధానానికి మంత్రి తోట నరసింహం, ఎమ్మెల్యేలు కన్నబాబు, విశ్వనాధ్‌రెడ్డిలు ముగ్ధులయ్యారు.
* శరీరానికి మేలు చేసే అంశాలపై…
మనిషికి ఉప్పు అపకారి అని అందరూ అంటుంటారు. కానీ ఉప్పు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని రాజోలు పాఠశాలకు చెందిన జె.శివశ్రీ, జి.ఝన్సీలు ప్రయోగాత్మకంగా వివరించారు. ఉప్పు థెరపీ వల్ల మానవ శరీరానికి అనేక ఉపయోగాలు ఉన్నాయన్నారు. ఎక్కడెక్కడ ఎటువంటి ఉప్పు లభ్యమవుతుంది… దాని ప్రయోజనాలేమిటో తెలిపారు.
* నాణేలన్నీ అక్కడే…
సైన్సుఫేర్‌లో పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి గురుకుల పాఠశాల విద్యార్థులు దేశ, విదేశాల నాణేలను సేకరించి ప్రదర్శించారు. దాదాపు 30 దేశాల కరెన్సీ, మన దేశ పురాతన నాణేలు 40 వరకూ ప్రదర్శనలో ఉంచారు. గత రూపాయి నోటు నుంచి ఇప్పటి రూ.వెయ్యి నోట్ల వరకూ ప్రదర్శించారు.
* భళా… చిత్రకళ
అల్లవరం మండలం గోడి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి జి.ప్రవీణ్‌కుమార్‌ గీసిన రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ చిత్రం ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతని చిత్ర కళను అందరూ మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి తోట నరసింహం, ఎమ్మెల్యే కన్నబాబులు ఈ చిత్రం గురించి ప్రస్తావించడం గమనార్హం.

 
Comments Off on విజ్ఞానం… అమోఘం

Posted by on November 5, 2013 in Uncategorized